‘‘ఐనా…ఇష్టం నువ్వు’’ కాదు ‘‘జానకితో నేను’’..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Keerthy Suresh Movie Title Changed: కీర్తి సురేష్ క్రేజ్ ‘మహానటి’తో ఎంతలా మారిపోయిందో తెలిసిందే. అప్పటినుంచి ఆమెని దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తూ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు.. లాక్‌డౌన్ సమయంలోనూ తను నటించిన ‘పెంగ్విన్’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసే సాహసం చేసిందంటే కీర్తి గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.


ప్రస్తుతం ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి’ వంటి సినిమాలతో సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రంలోనూ కీర్తిసురేష్ కథానాయకిగా కనిపించనుంది. తాజాగా ఈ చిత్రానికి ‘‘జానకితో నేను’’ అనే టైటిల్ ఖరారు చేశారు. తొలుత ‘‘ఐనా…ఇష్టం నువ్వు’’ అన్న పేరు పెట్టిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ‘‘జానకితో నేను’’ అనే టైటిల్ మరింత బావుంటుందన్న ఉద్దేశ్యంతో ఈ మార్పు చేశారు.


ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ అడ్డాల చంటి నిర్మిస్తున్నారు. నాగబాబు కీలక పాత్రలో నటించనుండగా.. రాహుల్ దేవ్ విలన్‌గా కనిపిస్తారు.


ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయని, నాలుగైదు రోజులు ప్యాచ్ వర్క్ చిత్రీకరణ మాత్రమే మిగిలివుందని, త్వరలో దానిని కీర్తిసురేష్ పైన చిత్రీకరిస్తామని నిర్మాత అడ్డాల చంటి తెలిపారు.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయని, అక్టోబర్ మొదటి వారానికి తొలికాపీ సిద్ధమౌతుందని ఆయన చెప్పారు. థియేటర్స్ ఓపెన్ కాగానే అనువైన తేదీన చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన వివరించారు. నవీన్, కీర్తిసురేష్ లు తమ పాత్రలలో ఎంతగానో ఒదిగిపోయారని..దర్శకుడు సన్నివేశాలన్నిటిని హృదయాలకు హత్తుకునేలా మలిచారని ఆయన చెప్పారు.


ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో సప్తగిరి, కొండవలస, చాందిని, ఫణి, రఘు తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సురేష్, సంగీతం: అచ్చు, నిర్మాత: అడ్డాల చంటి, దర్శకత్వం: రాంప్రసాద్ రౌతు.


Related Posts