తారక్ 30 లో కీర్తి సురేష్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

NTR 30: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఫైనల్ స్టేజ్‌కి వచ్చేస్తోంది. సూపర్ ఫాస్ట్‌గా షూటింగ్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాకు షిఫ్ట్ అవ్వాలి. త్రివిక్రమ్ సినిమాలో హీరోతో పాటు హీరోయిన్ సెలక్షన్ కూడా అంతే ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్ ఎవరబ్బా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.


త్రివిక్రమ్‌తో పనిచెయ్యడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందని ఫీల్ అవుతారు చాలా మంది ఆర్టిస్టులు. అందుకే స్టార్ హీరోలు చాలా మంది ఈ మాటల మాంత్రికుడితో మళ్లీ మళ్లీ సినిమా చెయ్యడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ‘అరవింద సమేత’ సూపర్ హిట్ అవ్వడంతో మరోసారి తమ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు ఎన్టీఆర్-త్రివిక్రమ్. ఇంకా ఈ సినిమా స్టార్ట్ అవ్వలేదు కానీ.. ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.

NTR

త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలతో పాటు.. హీరోయిన్లకు కూడా స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది.. అందుకే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ ఎవరా అన్న చర్చ బాగా జరుగుతోంది. ‘అరవింద సమేత’ లో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డేని ఫిక్స్ చేసిన త్రివిక్రమ్.. తన నెక్ట్స్ సినిమా ‘అల.. వైకుంఠపురములో’ మూవీలో కూడా బన్నీకి జోడీగా పూజానే కంటిన్యూ చేశాడు. తనకు కలిసొచ్చిన హీరోయిన్ పూజానే.. మరోసారి ఎన్టీఆర్‌కు జంటగా తీసుకుందామనుకుంటున్నాడట త్రివిక్రమ్.


త్రివిక్రమ్ పూజా హెగ్డేని అనుకుంటుంటే.. మిగతా వాళ్లు కొంతమంది బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్‌తో తమిళ్, తెలుగులో బిజీ అవుతున్న కీర్తిసురేష్‌ని హీరోయిన్‌గా సజెస్ట్ చేస్తున్నారట. ప్రజెంట్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న కీర్తి.. ఎన్టీఆర్‌కు కూడా ఫ్రెష్ పెయిర్ అవుతుంది కాబట్టి.. ఆమెనే కన్ఫామ్ చేద్దామనుకుంటున్నారట.Pawan Kalyan, Keerthy Suresh, Anu Emmanuel's Agnyaathavaasi movie stills - Photos,Images,Gallery - 80950కీర్తి ఇంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అజ్ఙాతవాసి’ లో నటించింది. ఆ సినిమా ఫలితం తెలిసిందే. దీంతో తారక్‌కు హీరోయిన్‌గా అటు కలిసొచ్చిన పూజానా..? ఇటు కొత్తగా కీర్తినా..? అని తెగ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట త్రివిక్రమ్ అండ్ కో. తారక్ జోడి ఎవరు అనే విషయంలో త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.Related Tags :

Related Posts :