Keerthy Suresh wraps up shooting of karthik subbaraj's Penguin

కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ షూటింగ్ పూర్తి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రీసెంట్‌గా ‘పెంగ్విన్’ (రైజ్ డెస్టినీడ్).. షూటింగ్ పూర్తి చేసింది కీర్తి సురేష్.. తమిళ, తెలుగు భాషల్లో 2020 వేసవిలో విడుదల కాబోతోందీ చిత్రం..

‘మహానటి’ సినిమాతో జాతీయ పురస్కారం దక్కించుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తోంది.. రీసెంట్‌గా ‘పెంగ్విన్’ (రైజ్ డెస్టినీడ్).. షూటింగ్ పూర్తి చేసింది కీర్తి.. ఇది ఆమె నటిస్తున్న 24వ సినిమా.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సమర్పణలో, స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై  ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ గర్భిణిగా కనిపించనుంది. తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన కీర్తి హిందీలో అజయ్ దేవ్‌గణ్ సరసన ‘మైదాన్’ సినిమాలో నటించనుంది.

Read Also : ఏడు భాషల్లో రియల్ స్టార్ ఉపేంద్ర ‘కబ్జా’ : నవంబర్ 15న షూటింగ్ ప్రారంభం

మలయాళంలో మోహన్ లాల్ సినిమాతో పాటు, నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న‘గుడ్‌లక్ సఖీ’ సినిమాలోనూ నటిస్తుంది. ‘పెంగ్విన్’ తమిళ, తెలుగు భాషల్లో 2020 వేసవిలో విడుదల కాబోతోంది.
 
 

Related Posts