లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

నీ క్షేమం మాకు కావాలి : ప్రపంచంలోనే అరుదైన జిరాఫీకి GPS tracker

Published

on

Kenya  Nairobi GPS tracker to White giraffe : లోకంలో ఎన్ని రంగులు ఉన్నా తెలుపు రంగు ప్రత్యేకతే వేరు. తెల్లని పులి, తెల్లటి నెమలి, తెల్లని నాగు ఇలా తెలుపు చాలా అరుదు..అపురూపం కూడా. అటువంటి ఓ జిరాఫీని అధికారులు చాలా చాలా అపురూపంగా సంరక్షిస్తున్నారు. అది ఏంచేస్తుందో..ఎక్కడుందో తెలుసుకుంటున్నారు. దాన్ని కాపాడటానికి నిరంతరం నిఘా పెట్టారు.కెన్యా సోమాలియా దేశాల సరిహద్దుల్లోని మైదానంలో ఉన్న ఈ అరుదైన తెల్ల జిరాఫీని అధికారులు అత్యంత జాగత్తగా సంరక్షిస్తున్నారు.ఆ తెల్లని జిరాఫీకి GPS tracker అమర్చారు. అది ఎక్కడికెళుతోందా అని ప్రతి క్షణం నిఘా పెట్టారు. అయితే ఇదంతా ఆ జిరాఫీ పారిపోతుందేమోననే అనుమానంతో కాదు. దానిని కాపాడడానికి. అవును ఆ జిరాఫీ ప్రపంచంలోనే అత్యంత అరుదైన జిరాఫీ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏకైక తెల్ల జిరాఫీ ఇది.వేటగాళ్ల బారి నుంచి దానిని రక్షించేందుకే ఈ జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చారు. కెన్యాలో సాధారణంగానే వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లు అధికంగా ఉంటారు. వారి బారి నుంచి రక్షించేందుకే దీనికి జీపీఎస్ ట్రాకర్‌ అమర్చామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జన్యు లోపం కారణంగానే ఈ జిరాఫీ ఇలా తెల్లరంగులో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఇది మగ జిరాఫీ అని, ప్రపంచంలో ఇదే చిట్టచివరి తెల్ల జిరాఫీ అని, అందుకే దీనిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా ఈ తెల్లజిరాఫీకి GPS tracker అమర్చటానికి అధికారులు దానికి మత్తుమందు ఇచ్చి దాని కొమ్ము దగ్గర GPS trackerను అమర్చారు. ఈ పరికరం ప్రతీ గంటకు జిరాఫీ ఎక్కడ ఉందో చేరవేస్తుంది.
ల్యూసిజం అనే అరుదైన జన్యు లోపం వల్ల ఈ జిరాఫీ తెల్లగా పుట్టింది. ప్రస్తుతం సోమాలియా సరిహద్దులోని మైదానాల్లో సంచరిస్తున్న ఈ తెల్ల జిరాఫీకి వేటగాళ్ల నుంచి తీవ్రస్థాయిలో ప్రమాదం ఉండటంతో అధికారులు దాని జాడ తెలుసుకోవటానికి దాన్ని నిరంతరం సంరక్షించటానికి GPS trackerను అమర్చారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *