లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

లైంగిక వేధింపులపై మహిళలు Chalk Back ఫైట్ : రోడ్డుపై రాతలు చూస్తే తల కొట్టుకోవాల్సిందే

Published

on

Kenyan women Chalk Back fight : అభివృద్ధి చెందిన దేశమైనా..కరవుతో అల్లాడే దేశమైన మహిళలపై జరిగే వేధింపులు మాత్రం సర్వసాధారణం. కూటికి లేనివాడు కూడా ఆడది కనిపిస్తే చాలు చెలరేగిపోతాడు. ఆమేదో తన ఆస్తి అయినట్లుగా..ఏదో హక్కు ఉన్నట్లుగా వేధిస్తాడు..సాధిస్తాడు. రోడ్డుమీద ఆడది కనిపిస్తే చాలు ఆకతాయిల బుర్రలో పురుగులు తొలుస్తాయి కాబోలు..వెంటపడి వేధిస్తారు..మాటలతో చేష్టలతో హింసలకు గురిచేస్తారు. అటువంటి పోకిరీలకు కెన్యా మహిళలు షాకులమీద షాకులిస్తున్నారు. తమను వేధించిన వెధవలకు ‘‘నడి రోడ్లపై తమ రాత’’తో తల దించుకునేలా చేస్తున్నారు అక్కడి మహిళలు. సిగ్గు ఉన్నవాడెవడైనా సరే ఆ రాతలు చదివాక తలకొట్టుకోవాల్సిందే. సిగ్గు తెచ్చుకోవాల్సిందే..ఆఫ్రికాలోని కిబెరాకు చెందిన మహిళలు, యువతులు, బాలికలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాలను వీధుల్లో నడిరోడ్లపైనా, గోడలపైనా రాస్తున్నారు. తమను వేధించినవారిని ఏమనాలనుకుంటున్నారో..వారి గురించి బాధితులు ఏమనుకుంటున్నారో నడి రోడ్లపై రాస్తు తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు.నడివీధుల్లో ఆడవారు లైంగిక వేధింపులకు గురికావడమనేది అక్కడ సర్వసాధారణంగా మారిందని ఎంతోమంది మహిళలు అంటున్నారు. ఆ వేధింపులు ఎంత వేదన కలిగిస్తాయంటే..నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడుతారు..వాటిలో కొన్ని మాటలు చెప్పటానికి రోతగా అనిపించినా కొన్ని చెప్పాలి. ఎందుకంటే ఆ మాటలు పడినవారు ఎంత మానసిక వేదనకు గురవుతున్నారో ఆ వేధింపులల్లో ఈటెల్లాంటి మాటలు వింటే తెలుస్తుంది. వాటిలో మచ్చుకు కొన్ని వేధింపులు ఇలా ఉంటాయి..‘నువ్వు బాగా కొవ్వెక్కి ఉన్నావే..దేవుడు తన దగ్గర ఉన్న మట్టి అంతా వాడేసి నిన్ను తయారుచేసినట్లున్నాడు. నీకు ముందూ వెనుకా బాగా బలిసి ఉన్నావు’అని 22ఏళ్ల యువతి చెప్పి వాపోయింది. ఇటువంటి భయంకరమైన వేధింపులతో మహిళలు ఎంత వేదనకు గురవుతున్నారో నడి రోడ్లపై వాళ్ల రాతలు చదివితే అర్థం అవుతుంది. 

సుద్దముక్కలతో రోడ్లమీదా..గోడలపై మార్కర్లతోను ‘చాక్ బ్యాక్’ పేరుతో ఒక ప్రచార కార్యక్రమం చేపట్టారు మహిళలు. దీంట్లో భాగంగా యువతులు కిబెరా వీధుల్లో తాము ఎదుర్కొంటున్న వేధింపుల బాధలను రోడ్లపైనా, గోడలపైనా రాస్తూ అందరికీ తెలిసేలా చేస్తున్నారు. వేధింపులకు గురయ్యామని వాళ్లు నోళ్లు మూసుకుని కూర్చోవట్లేదు. ఆ విషయాన్ని అందిరికీ తెలియజేసి..మద్దతు కూడగడుతూ..ఇటువంటి కార్యక్రమాలకు చేపట్టారు. ఇక్కడ ‘‘మీటూ’’కార్యక్రమంలాగా.. 

వీధుల్లో లైంగిక వేధింపుల వల్ల కలిగే బాధలపై అందరూ మాట్లాడుకునేలా ఈ రాతలు సాయపడతాయని వారు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంతో మహిళల్లో చైతన్యం వచ్చింది. వాళ్లిప్పుడు వేధించేవారిని ఎదుర్కొంటున్నారు. ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఈ ఈ వినూత్న కార్యక్రమం బాలికల్లో కూడా ధైర్యాన్ని నింపుతోంది. మనలా చాలామంది బాధితులు ఉన్నారు.వారు తమకు తోడుగా ఉంటారనే ధైర్యంతో పోకిరీలపై ఎదురు తిరుగుతున్నారు.అందుకే ఇలాంటి ప్రచారాలు చాలా అవసరమని..ఎవరో వేధించారనే వేదన చెందుతూ కూర్చోవాలని..అలా చేస్తే పలువురిలో ధైర్యాన్ని నింపు ప్రశ్నించే చైతన్యాన్ని కలుగచేస్తాయని ఇవి చాలా అవసరమవుతున్నాయి చాలామంది మహిళలు అంటున్నారు. 

తమ రాతల మెసేజ్‌లుస్తున్నారు. పోకిరీలకు షాక్ ఇస్తున్నారు. ”నా శరీరానికి గౌరవం ఇవ్వండి” నడిరోడ్లపై మెసేజులు రాస్తున్నారు. మరికొందరు మరోరకంగా ‘‘ఇది నా శరీరం.. దీనిపై నాకు తప్ప మరెవ్వరికీ హక్కులేదురా..వెధవల్లారా..మూసుకోండిరా’’అంటూ వారి వారికి వచ్చిన భాషల్లో రాస్తున్నారు. వారి బాధాకరమైన అనుభవాలను రాస్తున్నారు. కిబెరా రోడ్లపై ఏదో ఒక వికారపు మాట వినకుండా ఆడవారు వీధులు దాటలేరంటే అక్కడ లైంగిక వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఒక్కోసారి ఆడవారిని జంతువులతో పోల్చి..ఎవడితో వెళ్లినా తప్పులేదు..జంతువులకు మనకు ఒకటే నీతి అంటూంటారు. అలాగే తమకు నచ్చిన ఆడవారిని కూడా పోకిరీలు వదలరు..వారిని జంతువులతో పోలుస్తారు. పందులు వంటి జంతువులతో పోలుస్తారు. ఇటువంటి మాటలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. 

కానీ నడిరోడ్లపై ఇలా రాయటం వల్ల కొందరు పురుషులు అక్కడికి వచ్చి… మహిళలు ఈ రీతిలో వేధింపుల్ని బయటపెట్టడం వల్ల తమ కళ్లు తెరుచుకున్నాయని ..వారు ఎంతగా బాధపడుతున్నారో తమకు అర్థం అవుతోందనీ ఇంకెప్పుడు ఇలా చేయమని పశ్చాత్తాప పడుతున్నారని కొంతమంది యువతులు తెలిపారు.


 

అలా ఫీల్ అయిన కొంతమంది పురుషులు ‘‘ఆడవాళ్లను ఏమైనా అనొచ్చన్నట్లుగానే చాలాకాలంగా నా మెంటాలిటీ ఉండేదని కానీ..ఇలా రోడ్లపై రాసిని రాతలు చదివాక అది ఎంత తప్పో..బాధితులు ఎంతగా వేదన చెందుతున్నారో అర్థం అయిందనీ..ఇక ఎప్పుడూ ఇలా చేయకూడదని..బుద్ధి వచ్చిందని చెబుతూ సిగ్గుపడుతున్నారని తెలిపారు.ఈ రాతల వల్ల తమ బుద్ధిని మార్చుకుంటున్నామని చాలామంది యువకులు తమతో అన్నారని పలువురు యువతులు తెలిపారు.

 

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *