లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

10 ఏళ్ల చిన్నారి వంటలక్క..గంటలో 33 రకాల వంటలు వండేసి రికార్డ్స్

Published

on

Kerala : పదేళ్ల వయసున్న చిన్నారులు ఏం చేస్తారు? ఇప్పుడు స్కూళ్లు కూడా లేవు కాబట్టి అమ్మ వండిపెట్టింది తిని చక్కగా ఆటలు..పాటలతో గడిపేస్తుంటారు. లేదా అమ్మా నాకు అదికావాలి..ఇది కావాలి అని మారం చేస్తుంటారు.కానీ కేరళకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాత్రం చకచకా వంటలు వండిపెట్టేస్తోంది. చూసినవాళ్లను ఆశ్చర్యపరుస్తోంది.ఎంతగా అంటే గంటకు ఏకంగా 30రకాల వంటలు వండే అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. ఈ చిన్నారి వంటలక్క పేరు ‘ శాన్వి ఓం ప్రజిత్’ . వయస్సు సరిగ్గా 10సంవత్సరాల 6నెలలు. ఈ చిన్నారి వంటలక్క తన వంటలతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో స్థానం దక్కించుకుంది.


ఇడ్లీ, దోశ, ఊతప్ప, ఫ్రైడ్ రైస్, అప్పం, చికెన్ రోస్ట్, ఆమ్లెట్, పన్నీర్ టిక్కా, వాఫెల్, కార్న్ ఫ్రిట్టర్స్, పుట్టగొడుగుల టిక్కా, ఊతప్పం, ఎగ్ బుల్స్ ఐ, శాండ్‌విచ్, పాప్డీ ఛాట్, పాన్ కేక్..ఇలా ఏ వంటకం అయినా సరే ఇది నాకు రాదు అని మాత్రం అనదు చిటికెలో చేసి అక్కడ పెట్టేస్తుంది. ఇక టేస్ట్ చూడటం మీ వంతు అన్నట్లుగా. ఈ చిట్టివంటలక్క చేతి రుచి చూస్తే వదిలిపెట్టలేమట..మళ్లీ మళ్లీ తినాలనింపచేంత టేస్ట్ గా ఉంటాయట.


ఎర్నాకులానికి చెందిన వింగ్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాజిత్ బాబు గారాల పట్టి ఈ చిన్నారి వంటలక్ శాన్వి. తన వంటలతో ఈ చిన్నారి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో స్థానం దక్కించుకుంది.


శాన్వి తన ఇంట్లో వంట చేస్తుండగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అథారిటీ శాన్వి వంటల్ని ఆన్‌లైన్‌లో పర్యవేక్షించింది. సాక్ష్యంగా ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు 33 ఐటెంలు రెడీ చేస్తుండగా తల్లి మాంజిమా ప్రజిత్ ప్రోత్సాహిస్తుంటే చకచకా గంటలో మొత్తం 33 రకాల వంటలు చేసి పెట్టేసి రికార్డు కొట్టేసింది.


ఈ సందర్భంగా చిన్నారి శాన్వి మాట్లాడుతూ..తాను ఇన్నిరకాల వంటలు చేయడానికి కుటుంబం ప్రోత్సాహమేనని..మా అమ్మ స్టార్ చెఫ్..రియాలిటీ కుకరీ ఫైనలిస్ట్ తన ప్రోత్సాహం ఎంతో ఉంది..అంతేకాదు నా వంటలు తిన్న తన స్నేహితుల ఎంకేరేజ్ మెంట్ అని తెలిపింది. అమ్మబాటలో నడుస్తున్న చిన్నారి శాన్వి చిల్డ్రన్ కుకరీ షోలలో కూడా పాల్గొంది. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తోంది. తన వంటలతో నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది.


ఈ సందర్భంగా శాన్వి తల్లి మంజ్మా మాట్లాడుతూ..నా భర్త ప్రాజిత్ బాబు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ గా పఠాన్ కోట్ లో పనిచేసేవారు. నేను కుకరీ షోల్లో పాల్గొనేదాన్ని. అప్పుడు నా ఆరేళ్ల చిన్నారి శాన్విని ఇంట్లో ఒంటరిగా వదిలివెళ్లటం ఇష్టం లేక నా కూడా షోలకు తీసుకెళ్లేదాన్ని అలా కుకరీ షోలు చూస్తే పెరిగిన నా కూతురు ఇప్పుడు రికార్డు సాధించేవరకూ వెళ్లిందని అది నాకు చాలా చాలా సంతోషంగా ఉందని తెలిపారు.


అలా తన కూతురు 10ఏళ్లకే వంటల్లో నైపుణ్యం సంపాదించిదని తెలిపారు. వంటల్లో తన చాతుర్యం చూసి తాను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని సంప్రదించగా..వారు స్పందించి..తన కూతురు శాన్వి వంటలను పర్యవేక్షించి రికార్డ్స్ ను ఆగష్టు 29న నిర్ధారించారని తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *