లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

ఆటోలో ‘అమ్మ రుచి’ : తినకుండా ఉండలేరు..తింటే వదల్లేరు..

Published

on

Kerala Amma ruchi in auto : మహిళలు ఒకప్పుడు వంట ఇంటిలోనే వంట చేసేవారు. మగవారు తెచ్చిపెడితే వండిపెట్టేవారు.కానీ కాలం ఎంతోమారిపోయింది. ఆడవారు వంటలు చేస్తున్నారు. గరిట తిప్పినంత ఈజీగా దేశ ఎకానమీ పెంచటంలో తమదైన శైలిలో ముందుకెళుతున్నారు. ఎన్నో ఉన్నతస్థానాల్లోఉన్నత స్థాయిలో కీలక బాధ్యతల్ని చేపట్టి వ్యాపారాలను సునాయాసంగా నడుపుతున్నారు. ఉన్నతవిద్యలో రాణిస్తు ఉన్నతస్థాయిల్లో కంపెనీలను అభివృద్ధిబాటలో నడిపేస్తున్నారు.


అలాగే చదువు లేకపోయినా..ఇంటికోసం మేమున్నామంటున్నారు ఎంతోమంది మహిళా మణులు..ఇంటికోసం వండుకోవటమే కాదు వంటను ఉపాధిగా మార్చుకుని ఇంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నడుపుతున్నారు. అటువంటి మహిళలు కేరళలో ’’ఆటోలో అమ్మరుచు’’లతో ఆకట్టుకుంటున్నారు.


కేరళ ప్రభుత్వం మహిళా సాధికారతో కోసం ప్రవేశపెట్టిన ‘‘కుటుంబశ్రీ’’పథకం సహాయంతో ప్రియాబాయి అనే మహిళ మరి తొమ్మిది మహిళలకు కలుపుకుని ‘‘అమ్మ రుచి’’అనే పేరుతో ఆటోలో తగిన వంట సామగ్రీ సమకూర్చుకుని ఫుడ్ స్టాల్ ప్రారంభించింది.

ఆటో పైనా ‘‘సోలార్ పేనల్స్’’ఏర్పాటు చేశారు. ఆటో లోపల స్టీలు పొయ్యిలు బిగించారు. వంటకు కావాల్సిన ఎలక్ట్రిక్ వస్తువలన్నీ సౌరవిద్యుత్ ద్వారా పనిచేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు.


మహిళలంతా గులాబీ రంగు యూనిఫామ్ వేసుకుని..ఆకు పచ్చ రంగు యాప్రాన్ లు వేసుకుని ఘుమఘుమలాడే వంటలు తయారు చేస్తారు. ఆ ఘుమఘుమలు ముక్కకు సోకాయంటే చాలు ఇక అడుగు ముందుకు పడదు. కచ్చితంగా అక్కడికొచ్చి ఏదోకటి తినాల్సిందే.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>

పూర్తిగా మహిళలు నిర్వహించే ఈ ‘ఆటోలో అమ్మ రుచి’’త్వరలోనే మంచి పేరు తెచ్చుకుంది. తక్కువ ధరలకే వంటకాలు అందించటంతో కష్టమర్లు పెరిగారు..కలసెరి మెట్రో స్టేషన్ ప్రాంతాల్లో ఎంతగానోప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

డ్యూటీలు పూర్తి అయ్యాక ఇంటికి వెళ్లే పురుషులు ఈ ఆటో అమ్మరుచి చూడకుండా వెళ్లరు. రూ.5లకే దోశ,రూ.8లకే చపాతీలు ఆయా చట్నీలతో కూరలతో వేడి వేడిగా తినకుండా వెళ్లలేరు.

రాత్రి 7గంటలకు మొదలయ్యే ‘‘అమ్మరుచి’’ఆటోలు తెల్లవారుఝాము వరకూ ఘుమఘుమలాడుతూనే ఉంటాయి. ఈ ‘‘అమ్మరుచి’’ ఆటోలో ‘‘కప్పా-మీన్ కర్రీ వెరీ వెరీ స్పెషల్.


ఈ ఇంతుల ఆతిథ్యాన్ని..రుచుల్లో వైవిధ్యాన్ని ఆస్వాదించాలంటే కేరళ వెళ్లాల్సిందే.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *