ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘కరోనా’ ! : ఓటు వేయమంటూ..అభ్యర్థన!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

corona participating in Kollam Election : యావత్ ప్రపంచాన్ని కరోనా వణికించేస్తోంది. కానీ ప్రకృతి అందాలకు నియలమైన కేరళ వాసులు మాత్రం ఐ లవ్ కరోనా..అంటున్నారు.‘కరోనా’పై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారు. ప్రేమగా ఆదరిస్తున్నారు. ఇదేంటిరా బాబూ ప్రాణాలు తీసే కరోనాపై ప్రేమ చూపించటమేంటీ? పిచ్చా? వెర్రా? అనికుంటున్నారా?అసలు విషయం ఏమిటంటే..కేరళలో ‘కరోనా’అంటే వైరస్ మాత్రమే కాదు..అది ఓ మహిళా నేత పేరు. ఆమె పూర్తి పేరు ‘కరోనా థామస్’.ఆమె కేరళలో డిసెంబర్ నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారామె.


అదేంటీ ప్రపంచమంతా తిట్టుకునే కరోనాను పేరుగా పెట్టుకోవటమేంటీ? అని డౌట్ కూడా వచ్చేఉంటుంది కదూ. ఆమె ఇప్పటి ఎన్నికల్లో పోటీ చేస్తోంది అంటే మనం ఇప్పుడు వింటున్న కరోనా పేరు కూడా వినిపించని సమయంలో పుట్టిందని గమనించాలి. కరోనా థామస్ కు ఇప్పుడు 24 ఏళ్లు. కరోనా అనే మాటే వినిపించని రోజుల్లో ఆమెకు తండ్రి ఆ ‘‘కరోనా థామస్’ అని పేరు పెట్టారు. ఆమె కేరళలో జరగనున్నకొల్లం మున్సిపాలిటీ ఎన్నికల్లో లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కరోనా థామస్. అదన్నమాట ఎన్నికల బరిలో కరోనా పోటీ సంగతి..!!


కరోనా థామస్ పేరు వెనుక అసలు విషయం
కరోనా థామస్ తండ్రి పేరు థామస్ ఫ్రాన్సిస్. ఆయనకు 24 ఏళ్ల క్రితం కవల పిల్లలు పుట్టారు. వారిలో ఒకరు ఆడపిల్ల,ఒక మగపిల్లాడు పుట్టారు. ఆడపిల్లకు ‘కరోనా థామస్’ అని మగపిల్లాడికి ‘ కోరల్’అని పేరు పెట్టారు. కానీ అప్పుడు థామస్ ఫ్రాన్సిస్ కు తెలీలేదు. అసలు ఊహించి కూడా ఉండరు. తన కూతురు పేరు మీద ఓ మహమ్మారి వస్తుందనీ..అది ప్రజల ప్రాణాల్ని హరించేస్తుందనీ..ప్రపంచాన్ని గడగడలాడించేస్తుందని. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాల్ని హరించేస్తున్న క్రమంలో ప్రజలు ‘గో కరోనా’ కిల్ కరోనా’ అంటూ నినాదాలు చేస్తుంటూ విని ఉలిక్కిపడాల్సి వస్తుందనీ..బాధపడాలో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి వస్తుందని..


చైనాలో పుట్టిన కరోనా వైరస్ భారత దేశంలో కేరళలో తొలికేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అదే సయమంలో కరోనా థామస్ కుటుంబంలో కూడా కరోనా ఉలిక్కిపడి ఉంటుంది. కొల్లం మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల కరోనా థామస్ పోటీ చేస్తున్న సందర్భంగా ఆమె పేరు మరోసారి సంచలనంగా మారింది.


నా పేరు కరోనా అని చెప్పగానే ఉలిక్కిపడ్డ జనాలు
ఆమె మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సందర్భంగా కరోనా థామస్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె ప్రచారానికి వెళితే ఆమెపేరు విన్న జనాలు నోరెళ్లబెట్టేవారట. మనం విన్నది నిజమేనా అని ఉలిక్కిపడేవారట. వింతగా చూసేవారట. తన ఫ్రెండ్స్ కూడా తన పేరు మొదటిసారి విన్నప్పుడు షాక్ అయ్యారట.

కానీ ఈ పేరే తనకు బాగా కలిసి వస్తోందని అంటోంది కరోనా థామస్. మాస్క్ పెట్టుకున్నా..భౌతిక దూరం పాటించాలన్నా..శానిటైజర్ రాసుకోవాలనుకున్నా కరోనా థామస్ పేరు ఠక్కున గుర్తుకొస్తుందట ఓటర్లకు. దీంతో తనకు పెద్దగా ప్రచారం కూడా అవసరం ఉందంటోంది కరోనా థామస్.


నా పేరు నా అదృష్టం ..ఎన్నికల్లో విజయం సాధిస్తా
తన పేరు తెచ్చిన ప్రత్యేకతతో తనను ప్రజలు త్వరగా గుర్తు పడుతున్నారట. అస్సలు మరచిపోవట్లేదంటోందామె. ‘‘నా పేరు కరోనా థామస్..దయచేసి నా ఓటు వేయండి’’ అని ఆమె ప్రజల్ని ఓటు అడుగుతుంటే జనాలు ఆశ్చర్యపోతున్నారట. భలే ఉందే ఇదేం పేరు అంటున్నారట.అలాగే ఎన్నికల రోజున కూడా ప్రజలు తనను సులువుగా గుర్తుపెట్టుకుంటారని ఎందుకంటే తన పేరు ఏమాత్రం మరచిపోయే పేరు కాదని అంటోంది కరోనా సమయంలో ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న ‘‘కరోనా థామస్’’. తనపేరు తనకు అదృష్టాన్ని తెచ్చి పెట్టిందనీ..ఎన్నికల్లో తను కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేస్తోంది కరోనా థామస్.కరోనాకు సోకిన కరోనా వైరస్..షాక్ అయిన డాక్టర్లు
కాగా ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన కరోనా థామస్ కు కూడా కరోనా మహమ్మారి సోకింది. డెలివరీ కొన్ని రోజులకు ముందు కరోనా సోకింది. చికిత్స కోసం హాస్పిటల్ లో జాయిన్ అయింది. ఆ సమయంలో డాక్టర్లు ఆమె పేరు అడిగితే తెగ ఇబ్బంది పడిపోయిందట పేరు చెప్పటానికి. ఆఖరిని ‘‘నా పేరు కరోనా థామస్..నాకు కరోనా సోకింది’’అని చెబితే డాక్టర్లతో పాటు వైద్య సిబ్బంది అంతా షాక్ అయ్యారట. అవ్వరు మరీ..


కరోనా థామస్ కు కరోనా వచ్చాక ట్రీట్ మెంట్ తీసుకుంది. డెలివరీ అయ్యింది. తల్లీ బిడ్డా కరోనా బారినుంచి సురక్షితంగా బైటపడ్డారు. అదండీ కరోనా థామస్ పేరు వెనుక ఉన్న అసలు సంగతి. మరి కొల్లం ప్రజలు కరోనా థామస్ పేరును గుర్తు పెట్టుకుని ఆమెను గెలిపిస్తారో లేదో వేచి చూడాలి.


Shop named corona in kerala

కాగా ప్రపంచానికి కరోనా అనే పేరే తెలియని రోజుల్లోనే కేరళలో కరోనా అంటే తెలుసు. కొన్ని షాపులకు కరోనా అని పేర్లు కూడా ఉన్నాయి. ఓ బట్టల షాపుకు..ఓ మొక్కల దుకాణానికి కరోనా అని పేర్లు పెట్టుకోవటం విశేషం. అలాగే 24 ఏళ్ల క్రితమే కరోనా అనే పేరు ఓ అమ్మాయికి పెట్టటం అంతకంటే విశేషం.

Related Tags :

Related Posts :