వాట‌ర్ ట్యాక్సీ సర్వీసులు ప్రారంభించిన కేరళ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kerala launched first water taxi service కేర‌ళ రాష్ర్ట ప్ర‌భుత్వం మొద‌టిసారిగా వాట‌ర్ టాక్సీ సర్వీసుల‌ను ప్రారంభించింది. ఆదివారం(అక్టోబర్-18,2020)అల‌ప్పుజ బ్యాక్ వాట‌ర్స్‌లో ఈ వాట‌ర్ టాక్సీల‌ను రాష్ర్ట వాటర్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. కాటమరాన్ డీజిల్ శక్తితో పనిచేసే ఈ టాక్సీలు 10 మంది ప్రయాణీకులకు కూర్చుని ప్ర‌యాణించే సామర్థ్యం క‌లిగిఉన్నాయి.న‌వ‌గ‌తి మెరైన్ డిజైన్ అండ్ క‌న్‌స్ర్ట‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ వాట‌ర్ టాక్సీల‌ను నిర్మించింది. ఎల‌క్ర్టిక్ ప‌వ‌ర్ స్టీరింగ్, సోలార్ ప్యానెల్ అమ‌రిక‌తో అన్ని విద్యుత్ అవ‌స‌రాల‌ను తీర్చేలా దీన్ని తయారుచేశారు. చిన్న ప‌రిమాణం కార‌ణంగా ఈ ట్యాక్సీల్లో ఎక్క‌డికైనా చేరుకోవ‌చ్చు. గంట‌కు 35 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తాయి.

Related Posts