రేప్ సీన్ వీడియోలు వైరల్ : ఆ పాత్రలో నటించిన నటి ఆత్మహత్యాయత్నం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘For Sale’ movie scenes land in porn websites : ఏడేళ్ల క్రితం విడుదలైన ఫర్ సేల్ అనే మళయాళ సినిమాలో లో ఒక బెడ్ రూం సీన్ లో నటించిన నటి… ఆ దృశ్యాలు ఇప్పుడు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో వైరల్ అవటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

సోనా అబ్రహం (21) అనే నటి తన14 ఏళ్ల వయస్సులో ఫర్ సేల్ అనే మళయాళ చిత్రంలో ఒక బెడ్ రూం, రేప్ సీన్ లో నటించింది. తన సోదరి జీవితం నాశనం కావటం చూసి ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్ పాత్రలో సంధ్య నటించింది. జీవితం నాశనం అయిన సోదరి పాత్రలో సోనా అబ్రహం నటించింది. ఆ చిత్రంలో ఆమె పాత్ర ప్రేక్షకులకు గుర్తుండి పోయింది. ఈ చిత్రం 2013లో విడుదలైంది.సినిమాలో ఆమెపై జరిగిన రేప్ సీన్ దృశ్యాలు అసభ్యతకు తావు లేకుండా ఎడిట్ చేసి సినిమా రిలీజ్ చేసారు. ఫర్ సేల్ సినిమాలో నటించేటప్పటికి ఇంకా ఆమె స్కూల్ చదువు పూర్తి కాలేదు. తర్వాతి కాలంలో ఆమె సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి చదవు మీద దృష్టి సారించింది. ఇప్పుడు లా కోర్సు చదువుతోంది. కుటుంబ ఆర్ధిక పరిస్ధితుల కారణంగా ఆరోజు సోనా అబ్రహం రేప్ సీన్ లోనటించింది.సోనా అబ్రహం పై రేప్ సీన్ తీయటానికి ఆ చిత్ర దర్శకుడు సతీష్ అనంతపురి దాదాపు 150 మంది యూనిట్ సభ్యుల మధ్య చిత్రీకరించటానికి ప్లాన్ చేశారు. అందుకు సోనా అభ్యంతరం చెప్పటంతో ఆ దృశ్యాలను తక్కువ మంది యూనిట్ సభ్యులతో డైరెక్టర్ ఆఫీసులో చిత్రీకరించారు. అ

విశాఖలో దారుణం, ఎమ్మెల్యే అనుచరుడి వేధింపులు తట్టుకోలేక శానిటైజర్ తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం


ప్పటికి 10వ తరగతి చదువుతున్న సోనా అబ్రహం మర్నాటి నుంచి మామూలుగానే స్కూల్ కు వెళ్లి చదువుకోసాగింది. ఆ చిత్రంలో రేప్ సీన్ అనంతరం ఆ పాత్ర ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ…… ఆపాత్ర పోషించిన నటి సోనా అబ్రహం ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేయటం కలకలం రేపింది.సినిమా విడుదలైన రెండేళ్లకు, ఆమె ప్లస్ టూ చదివే సమయానికి ఆ సినిమాలోని ఎడిట్ చేయని దృశ్యాలు యూట్యూబ్ లోనూ, అశ్లీల వెబ్ సైట్లలోనూ దర్శనం ఇచ్చాయి. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దృశ్యాలు చూసి మానసిక వేదనకు గురైన సోనా ఆ వీడియోలను డిలీట్ చేయాల్సిందిగా యూట్యూబ్ వారిని, కేరళ సీఎంను. డీజీపీని, సైబర్ క్రైం పోలీసులను కోరింది.కానీ ఆమె ఆవేదన అరణ్య రోదనే అయ్యింది. సదరు సంస్ధ నేటికి వాటిని డిలీట్ చేయలేదు….. యూట్యూబ్ నుంచి తొలగించలేదు. దీంతో ఇటీవల సోనూ ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి ఆమె తల్లితండ్రులు అది గమనించి ఆమెను రక్షించారు. కేవలం నిర్మాత, ఎడిటర్, దర్శకుడి వద్ద ఉండాల్సిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయ్యాయనేది ఇప్పుడు ఆమెను వేధిస్తున్న ప్రశ్న. దీనికి వారినుంచి సరైన సమాధానం లభించలేదు.

డీజీపీకి ఇతర పెద్దలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ దృశ్యాలను తొలగించకపోయే సరికి సోనా న్యాయ స్ధానాన్ని ఆశ్రయించారు. తనలాంటి మధ్యతరగతి యువతి గత 5 ఏళ్ళుగా ఎన్నో అవమానాలు ఎదుర్కోంటూ జీవిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Related Tags :

Related Posts :