లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మనసిచ్చినవాడితో ఘనంగా నటి, ట్రాన్స్‌ ఉమెన్‌ పెళ్లి : అదృష్టమంటే ఇదే కదా..

Published

on

Kerala : Malayalam actress elizabeth harini Marriage : ట్రాన్స్‌జెండర్లను ఎవరైనా ప్రేమిస్తారా?వారిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అసవారికి దాంపత్య జీవితం అదృష్టం ఉంటుందా? ఈ సమాజం అంత పెద్ద మనస్సుతో ఆలోచిస్తుందా? అంటే లేదనే చెప్పాలి.కానీ ట్రాన్స్ ఉమెన్ అయిన ఎలిజబెత్‌ హరిని చందన అనే ఓ మళయాళ నటి నిజంగా అటువంటి అదృష్టానికి నోచుకుంది. అందుకే ఆమెను ఓ యువకుడు మనసారా ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఎలిజబెత్‌ హరిని చందన మెడలో మూడు ముడులు వేసి కొత్త జీవితాన్నిచ్చి వైవాహిక జీవితంలోకి ఆహ్వానించాడు. వీరి వివాహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎలిజబెత్‌ హరిని చందన కొంతకాలంగా తను గాఢంగా ప్రేమిస్తున్న సునీష్‌ను వేదమంత్రాల సాక్షిగా మనువాడారు. కేరళలోని ఎర్నాకులమ్‌ బీటీహెచ్‌ హాల్‌లో మనసిచ్చినవాడిని మనువాడింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సెలబ్రిటీల మేకప్‌ ఆర్టిస్ట్‌, ట్రాన్స్‌జెండర్‌ రెంజు రెంజిమార్‌ వధువు తల్లి స్థానంలో నిలబడి పెళ్లి చేశారు.

ఎలిజబెత్‌ను పెళ్లి కూతురిని చేసే దగ్గర నుంచి అప్పగింతల వరకు అన్ని కార్యక్రమాలను ఆమె దగ్గరుండి చూసుకున్నారు. వీరి పెళ్లి ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ “తల్లిగా నా బాధ్యతలను పూర్తి చేశాను. నా చేతుల మీదుగా కూతురి పెళ్లి చేశాను. ఇటువంటి భాగ్యాన్నిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు‘ అని తెలిపారు.

కాగా.. కుంబలంగికి చెందిన హరిని చందన 17 ఏళ్ల వయసులో సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారారు. 2017లో కొచ్చిలో జరిగిన ట్రాన్స్‌జెండర్‌ అందాల పోటీలో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. అనంతరం సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి ‘దైవత్తింటే మనవట్టి’ అనే మలయాళ హిట్‌ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో నటుడు జయసూర్య ముఖ్యపాత్రలో కనిపించారు. ఇప్పుడు వివాహ జీవితంలోకి అడుగు పెట్టి మరోసారి అందరిని ఆకర్షించారు.

 

View this post on Instagram

 

A post shared by Renju Renjimar (@renjurenjimar)