Kerala Man Watched As Cobra Bit Sleeping Wife In Grisly Murder Plan: Cops

నిద్రపోతున్న భార్యను చంపేయాలని త్రాచు పాముతో ప్లాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కేరళలోని వ్యక్తి ఇంట్లోకి పాము వదిలి భార్య ప్రాణాలు తీశాడు.  ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించినప్పటికీ ఫైయిల్ అయ్యాడు. సూరజ్ అనే వ్యక్తి ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య ఉత్రాను చంపడానికి పాము కొన్నాడు. దాంతో పాటు ఇంటర్నెట్ లో పాముల వీడియోలు చూశాడు. ఆమె చనిపోయాక డబ్బులు, బంగారం తీసుకుని పారిపోయి ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలనేది అతని ప్లాన్. 

మే7న కొల్లాంలో ఉత్రా తన ఇంట్లోనే చనిపోయి ఉంది. ఆమె తరపు బంధువులందరికీ పాము కాటుతో చనిపోయినట్లుగానే తెలిసింది. వారికి దీంతో పాటు మరో అనుమానం రాకపోలేదు. కొద్ది రోజుల ముందు అంటే మార్చి నెలలోనూ పాము కాటేసినట్లు తెలియడంతో అనుమానం వచ్చింది. ఆమెకు సంవత్సరం వయస్సున్న కొడుకు కూడా ఉన్నాడు. 

కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ నిజాలు బయటపడ్డాయి. సూరజ్ (27) ఫిబ్రవరిలో ఇలాంటి పథకమే వేశాడు. అతని ఫ్రెండ్ సురేశ్ సాయంతో ఓ విష నాగును పట్టుకొచ్చాడు. ఆ పాము కాటుతో ఉత్రా హాస్పిటల్ పాలైంది. ఓ నెల రోజుల పాటు ట్రీట్‌మెంట్ తీసుకుని డిశ్చార్జ్ తర్వాత పేరెంట్స్ ఇంటికి వెళ్లింది. 

ఏప్రిల్‌లో రెండో ప్రయత్నంలోనూ సూరజ్ అదే ఫ్రెండ్ నుంచి త్రాచు పామును తెప్పించాడు. మే6న నిద్రపోతున్న భార్య మీదకు సూరజ్ పామును విసిరేశాడు. మంచం మీద కూర్చొని ఉత్రాను రెండోసారి పాము కాటు వేసేవరకూ చూస్తూ ఉన్నాడు. రెండో రోజు ఉదయం హాస్పిటల్ కు తీసుకెళ్లేసరికి ఆమె పాముకాటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. 

సూరజ్ మరోసారి పామును సంచిలో వేసుకునేందుకు ప్రయత్నించడంతో అది పారిపోయింది. భార్యకు పాము కాటువేసినా దానిని పట్టుకునేందుకు రాత్రంతా వెదుకుతూ ఉన్నాడు. చాలాసేపటి తర్వాత ఆ ఇంట్లోనే పాము దొరికింది. భార్య చనిపోయిన తర్వాత ఆస్తి హక్కులు పొందడం కోసం ప్రయత్నిస్తుంటే పేరెంట్స్ అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు. 

పోలీసులు సూరజ్ ఇది కేవలం డబ్బు కోసమే చేశాడని చెప్పారు. పెళ్లికి కట్నం కింద పెద్ద మొత్తంలో డబ్బు, 100 బంగారు నాణేలు తీసుకున్నాడు. అన్ని తీసుకున్నా అతనికి ఉత్రాను తుదముట్టించి వేరే వ్యక్తిని పెళ్లాడాలని అనుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. 

Related Tags :

Related Posts :