Kerala serial killer Jolly

14 ఏళ్లు 6 మర్డర్ల కేసులో షాకింగ్ ట్విస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆస్తి కోసం అత్తింటి వారిని ఒక్కొక్కరిగా హత్య చేసిన కేరళ మర్డర్స్‌ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హంతకురాలు జాలీని సీరియల్‌ కిల్లర్‌గా పరిగణించిన

ఆస్తి కోసం భర్త సహా అత్తింటి వారిని ఒక్కొక్కరిగా హత్య చేసిన కేరళ మర్డర్స్‌ కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హంతకురాలు జాలీని సీరియల్‌ కిల్లర్‌గా పరిగణించిన పోలీసులు.. స్ప్లిట్‌ పర్సనాలిటీ ఉన్నట్టు భావిస్తున్నారు. తన భర్త సహా 6 మందిని మట్టుబెట్టిన జాలీ థామస్.. మరిన్ని హత్యలకు ప్లాన్‌ చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. మరో ఇద్దరు చిన్నారులను చంపేందుకు స్కెచ్ వేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నిందితురాలే స్వయంగా వెల్లడించినట్లు కోజికోడ్ రూరల్ ఎస్పీ చెప్పారు. విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.

14 ఏళ్లలో 6 వరుస హత్యల కేసు కేరళలో సంచలనం సృష్టించింది. ఈ హత్యలు వెనుకున్న ప్రధాన సూత్రధారి ఆ ఇంటి కోడలు జాలీ, ఆమె రెండో భర్త షాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని హత్యలు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జాలీతో సహా మరో మహిళతో ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్న స్థానిక కాంగ్రెస్ నేత రామకృష్ణన్ కూడా 2016లో గుండెపోటుతో చనిపోయాడు. దీంతో మరిన్ని హత్యలు జరిగి ఉండొచ్చని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వరుస హత్యల ఘటనను ఛేదించేందుకు స్థానిక రాజకీయ నేతలు సహా జాలీతో నిత్యం టచ్ లో ఉండే 11 మందిని పోలీసులు విచారిస్తున్నారు.

2002 నుంచి 2016 వరకు జరిగిన వరుస హత్యలను బయటపెట్టడానికి ప్రధాన కారణం రాయ్ థామస్ సోదరుడు రోజో. ఆయన కూడా జాలీ మర్డర్ జాబితాలో ఉండేవాడే. ఆస్తి కోసం జరిగిన ఈ హత్యల్లో అతడు, అతడి కుటుంబ సభ్యులు అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. విదేశాల్లో ఉండటంతో బతికిపోయారని పోలీసులు చెప్పారు.

కాగా ఈ కేసులో జాలీ రెండో భర్త షాజూ ముందు బుకాయించాడు. తనకేమీ తెలియదని నాటకం ఆడాడు. తన భార్య సిలీ, తన రెండేళ్ల కుమార్తె ఆల్పైన్ హత్య వెనుక జాలీ కుట్ర ఉందని తనకు తెలీదని షాజు చెప్పాడు. అసలు ఈ అనుమానాస్పద మరణాల వెనుక జాలీ ఉందన్న విషయమే తెలియదన్నాడు. అయితే పోలీసుల అదుపులో ఉన్న జాలీ.. రెండో పెళ్లికి ముందే ఈ విషయాన్ని షాజూకి చెప్పినట్లు వెల్లడించింది. తమదైన స్టైల్ లో పోలీసులు విచారించడంతో తన భార్య, కుమార్తె హత్య కుట్రలో తానూ భాగమైనట్టు షాజు అంగీకరించాడు. జాలీ అరెస్ట్ తో అలర్ట్ అయిన షాజూ.. ఆధారాలు దొరక్కుండా తన ఇంట్లోని వస్తువులను, కంప్యూటర్ ను వేరే ప్రాంతానికి తరలించడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసుతో షాజూకి సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

READ  హై అలర్ట్: ఆంధ్ర, కేరళల్లో భారీ వర్ష సూచన

కోజికోడ్ జిల్లా పొన్నమట్టంలో నివసించే జాలీ థామస్ 14 ఏళ్ల కిందట తన అత్త అన్నమ్మ థామస్ ను మొదట హత్య చేసింది. భోజనంలో కొద్ది కొద్దిగా సైనేడ్ కలుపుతూ ఆమెను హత్య చేసింది. నాలుగేళ్ల తర్వాత అన్నమ్మ భర్త టామ్ థామస్ గుండెనొప్పితో చనిపోయారు. అప్పట్లో దీన్ని సహజ మరణంగా భావించారు కుటుంబ సభ్యులు. 2011లో భర్త రాయ్ థామస్ ను హత్య చేసింది జాలీ. 2014లో అన్నమ్మ థామస్ సోదరుడు మాథ్యూ మరణించారు. ఆ తర్వాత రెండో భర్త షాజూ భార్య సిలీ, ఆమె రెండేళ్ల కూతురు ఆల్పైన్ చనిపోయారు.

ఆరు హత్యల తర్వాత కొన్నేళ్లు ఆగిన జాలీ.. షాజుని రెండో పెళ్లి చేసుకుంది. తన పేరుని జాలీ షాజుగా మార్చుకుంది. అదే సమయంలో రాయ్ థామస్ కు చెందిన ఆస్తిని తన పేరు మీద బదలాయించుకోవడానికి ఆమె ప్రయత్నించడం అనుమానాలకు బలం చేకూరింది. రాయ్ థామస్ సోదరుడు జాలీపై ఫిర్యాదు చేయడంతో హత్యల పరంపరం వెలుగులోకి వచ్చింది.

Related Posts