వారే ఐపీఎల్-2020 టైటిల్ కొడతారట.. విజేతపై పీటర్సన్ జోస్యం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మరో వారం రోజుల్లో ఐపీఎల్-2020 సమరానికి జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈసారి మ్యాచ్ సమయంలో స్టేడియం ఎడారిగా ఉంటుంది.. అభిమానుల శబ్దాలు ఈసారి వినబడవు. చాలా నియమాలు మార్చేశారు. ఈ విషయాల మధ్య ప్రతి జట్టు తనను తాను విజేతగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఐపీఎల్‌లో ఎవరు విజేత అవుతారనే దానిపై క్రికెట్‌ విశ్లేషకుల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఇంగ్లీష్ క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్న కెవిన్ పీటర్సన్ తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.

ఐపీఎల్ 2020 సీజన్‌కి కామెంట్రీ చెప్పేందుకు యూఏఈ గడ్డపై అడుగుపెట్టిన కెవిన్ పీటర్సన్.. వచ్చీరాగానే టోర్నీ విజేతగా ఈసారి యువ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇటీవల ముగిసిన మూడు టీ20‌ల సిరీస్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించిన కెవిన్ పీటర్సన్.. అక్కడి నుంచి నేరుగా నిర్బంధం మధ్యనే యూఏఈ చేరుకున్నారు. ఇప్పటి వరకూ 12 ఐపీఎల్ సీజన్లు ముగియగా.. ఢిల్లీ క్యాపిటిల్స్ కనీసం ఒక్కసారి కూడా టోర్నీ విజేతగా నిలవలేదు.

పీటర్సన్ ఐపీఎల్‌లో కూడా ఇంతకుముందు ఆడాడు. ఆర్‌సిబి, సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణే సూపర్‌జైంట్స్, డెక్కన్ ఛార్జర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ వంటి అనేక జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈసారి ఏ జట్టు ఐపీఎల్ విజేతగా ఉంటుందో పీటర్సన్ చెప్పాడు. పీటర్సన్ ఈ జట్టు కోసం ఆడినప్పటికీ ఈ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోలేదు.

ఈసారి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ విజేత కావచ్చని తాను భావిస్తున్నానని పీటర్సన్ చెప్పాడు. శ్రేయాస్ కెప్టెన్సీలో, ఈ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. గత సంవత్సరం ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కాని ఫైనల్‌కు చేరుకోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపిఎల్ చరిత్ర ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఈ జట్టు ఒక్కసారి కూడా ఐపిఎల్ ఫైనల్‌కు చేరుకోలేదు. అయితే ఈ సీజన్‌లో ఐపిఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను బలమైన పోటీదారులుగా పరిగణిస్తున్నారు విశ్లేషకులు.

Related Posts