రెడీ, స్టార్ట్ కెమెరా.. యాక్షన్… ‘కె.జి.యఫ్‌ 2’ షూటింగ్ షురూ!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

KGF 2 Shooting Update: రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా.. కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న‌ భారీ బ‌డ్జెట్ చిత్రం ‘కె.జి.య‌ఫ్‌’ చాప్ట‌ర్ 2. క‌న్న‌డ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే అత్యంత‌ భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.య‌ఫ్’ సంచ‌ల‌న విజ‌యం సాధించ‌గా ఇప్పుడు రెండో భాగం మ‌రింత సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

‘కె.జి.య‌ఫ్’ చాప్ట‌ర్ 1ను పాన్ ఇండియా చిత్రంగా క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు. ‘కె.జి.య‌ఫ్’ చాప్ట‌ర్ 2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. చాప్ట‌ర్ 1 సాధించిన విజ‌యంతో పెరిగిన అంచ‌నాల‌కు ధీటుగా ద‌ర్శ‌క నిర్మాత‌లు ‘కె.జి.య‌ఫ్’ చాప్ట‌ర్ 2ను రాజీ లేకుండా నిర్మిస్తున్నారు. రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో య‌ష్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌నున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆగ‌స్ట్ 26 నుంచి ‘కె.జి.యఫ్‌ 2’ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. చాప్ట‌ర్‌-2 బ్యాలెన్స్ షూటింగ్ ఎప్పుడు పూర్త‌వుతుందా, ఎప్పుడు విడుద‌ల‌వుతుందా అని దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న‌ అభిమానులకు ఇది శుభ‌వార్త‌. ఈనెల 26 నుంచి బెంగ‌ళూరులోని కంఠీర‌వ స్టూడియోలో ‘కె.జి.యఫ్‌ 2’ షూటింగ్ మొద‌ల‌వుతోంది.

దీనికోసం ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌, ఇత‌ర కీల‌క‌మైన యూనిట్ స‌భ్యుల‌తో క‌లిసి, లొకేష‌న్ రెక్కీ నిర్వ‌హించారు. 26 నుంచి జ‌రిగే బ్యాలెన్స్ షూటింగ్‌లో ప్ర‌కాష్ రాజ్‌, మాళ‌వికా అవినాష్ త‌దిత‌రులు పాల్గొంటున్నారు. ప‌దిరోజుల పాటు జ‌రిగే ఈ షెడ్యూల్‌తో కేవ‌లం క్లైమాక్స్ ఫైట్ మిన‌హా మొత్తం సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్లే. తొలి భాగాన్ని మించి రెండో భాగం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో అధీర పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Related Tags :

Related Posts :