KGF Movie Two Weeks Collections -10TV

రెండు వారాల్లో రికార్డ్ కలెక్షన్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యే వరకు, కె.జి.ఎఫ్. బాక్సాఫీస్ దండయాత్ర కంటిన్యూ అవుతుంది. 

కన్నడ హీరో యశ్, శ్రినిధి శెట్టి జంటగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందిన కె.జి.ఎఫ్. మూవీ, డిసెంబర్ 21న కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ అయ్యింది. కంటెంట్ మరీ కొత్తదేం కాకపోయినా, హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ, ఆడియన్స్ ఇంతకుముందెప్పుడూ స్ర్కీన్‌పై చూడని బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కడంతో, కన్నడతో సహా అన్ని చోట్లా, మౌత్‌టాక్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. మాస్ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ కె.జి.ఎఫ్ మూవీని చూస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, హౌస్ ఫుల్  కలెక్షన్స్‌లతో అదరగొడుతుంది కె.జి.ఎఫ్. తెలుగు వెర్షన్, రెండు వారాల్లో ఎంత మేర వసూళ్ళు రాబట్టిందనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
నైజాం : రూ. 3.19కోట్లు, సీడెడ్ : 1.82కోట్లు, ఉత్తరాంధ్ర : 1.09కోట్లు, ఈస్ట్ : 0.54కోట్లు, వెస్ట్ : 0.47కోట్లు, కృష్ణ : 0.81కోట్లు, గుంటూరు : 0.69కోట్లు, ఏపీ, తెలంగాణా : రూ.9.59కోట్లు (డిస్ట్రిబ్యూటర్ షేర్).. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ తక్కువ రేటుకే తీసుకోవడంతో, ఫస్ట్ వీక్‌లోనే పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యే వరకు, కె.జి.ఎఫ్. బాక్సాఫీస్ దండయాత్ర కంటిన్యూ అవుతుంది. 

వాచ్ ట్రైలర్… 
 

Related Posts