లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

పవన్ పక్కన రానా కాదు.. కిచ్చా సుదీప్!

Published

on

Pawan Kalyan-Kichcha Sudeep: మలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో తెరకెక్కించడానికి ప్రముఖ నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రైట్స్ దక్కించుకుంది. ఈ రీమేక్‌లో బాలయ్య, రానా, రవితేజ వంటి పలువురు హీరోల పేర్లు వినిపించాయి కానీ ఎట్టకేలకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నట్లు దసరా సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.Sasikumar and Sarath Kumar team up for superhit remake? - Tamil News - IndiaGlitz.com‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు సాగర్ కె.చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బిజు మీనన్ చేసిన పోలీస్ క్యారెక్టర్ పవన్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ పాత్రలో రానాకనిపించనున్నాడని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రానాను పక్కన పెట్టి మరో స్టార్ హీరోకు అవకాశమిచ్చారని సమాచారం.


రానా కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు. బాలీవుడ్‌లో వ‌ర్సెటైల్ యాక్ట‌ర్ కూడా. అందుకే.. ‘బాహుబ‌లి’ లో భల్లాలదేవ లాంటి క్యారెక్ట‌ర్ ఇచ్చారు. సినిమాలో నెగ‌టివ్ రోలే అయినా.. సినిమా విజ‌యంలో మాత్రం పాజిటివ్‌గా కీ రోల్ ప్లే చేశాడనే చెప్పాలి.. అయితే పవన్ పక్కన రానా వంటి కుర్ర హీరోని పెడతారా అనే వార్తలు రావడంతో ఆలోచనలో పడ్డ మేకర్స్ పృథ్వీరాజ్ క్యారెక్టర్‌కు ‘కిచ్చా’ సుదీప్‌ని అనుకుంటున్నారట.Kichcha Sudeep‘ర‌క్త చ‌రిత్ర‌, ఈగ, బాహుబలి-1, సైరా’ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న సుదీప్ అయితే స్టార్ హీరో, పైగా పవన్ పక్కన సరిగ్గా సరిపోతాడు.. రానా పేరు వార్తల్లో వచ్చింది కానీ మనం అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కాబట్టి సుదీప్ నే ఫిక్స్ చేద్దామనే ఆలోచనలో మూవీ టీమ్ ఉందని తెలుస్తోంది. కాగా కన్నడ సినిమా షూటింగ్ నిమిత్తం ఇటీవల హైదరాబాద్ వచ్చిన సుదీప్.. పవర్‌‌స్టార్‌ను కలిసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీనే కావడం విశేషం.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *