పవన్ కళ్యాణ్‌తో కిచ్చా సుదీప్ భేటీ!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kicha Sudeep – Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో పాపులర్ కన్నడ నటుడు ‘కిచ్చా’ సుదీప్ భేటీ అయ్యారు.
సోమవారం ఉదయం పవన్ కళ్యాణ్ ను ఆయన ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు సుదీప్.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, సుదీప్ కు మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట పాటు సంభాషణ సాగింది. కోవిడ్ అన్‌లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి… ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్, పవర్ స్టార్ కు వివరించారు.

కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే… సుదీప్, పవన్ కళ్యాణ్ ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.

Kicha Sudeep - Pawan Kalyan

Kicha Sudeep - Pawan Kalyan Kicha Sudeep - Pawan Kalyan

 

Related Tags :

Related Posts :