లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పవన్ – రానా సినిమా షూటింగ్ ప్రారంభం..

Published

on

PSPK – Rana: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో స్పీడ్ పెంచారు.. ఇటీవలే ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేసిన పవన్ మంగళవారం(జనవరి 26)న కొత్త సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసినట్లు వీడియో విడుదల చేసింది మూవీ టీమ్.

పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా.. మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం : 12 గా ఈ సినిమాను రూపొందిస్తుంది.

రానా – పవన్ సినిమా ప్రారంభం..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. ‘తీన్‌మార్’ తర్వాత పవన్ మరో రీమేక్ సినిమాకు పెన్ను పెడుతున్నారు త్రివిక్రమ్. ఈ చిత్రానికి సమర్పణ : పిడివి ప్రసాద్, సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్, నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ.