ఇంతేలే కరోనా చదువులు: జూమ్ లో టీచర్ పాఠాలు..గుర్రుపెట్టి నిద్రపోతున్న పిల్లాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

క‌రోనా తెచ్చి నమార్పులు ఎన్నని చెప్పాలి..ఏమని చెప్పాలి. ఆఫీసు గ‌దుల్లో కూర్చుని పనిచేసేవాళ్లంతా ఇళ్లల్లోనే కూర్చుని పనిచేస్తున్నారు. స్కూలుకు పుస్తకాలు పట్టుకుని వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు ఇళ్లల్లోనే స్మార్ట్ ఫోన్లు.. కంప్యూట‌ర్‌లు ముందు పెట్టుకుని ఎక్కడో ఉన్న టీచర్ చెప్పే పాఠాల్ని వినాల్సి వస్తోంది. ఆటల్లేవు..పాటల్లేవు..ఫ్రెండ్సూ లేరు..వారితో ముచ్చట్లు లేవు..ఏమీ లేవు. కానీ ఆన్‌లైన్‌లో మాత్రం పిల్ల‌ల‌కు క్లాసులు జ‌రుగుతున్నాయి.

ఆ..లేవరా..స్కూలు కెళ్లే టైమ్అయ్యింది అని కేకలేసే అమ్మల కేకలు వినిపించట్లేదు. కానీ..నిద్ర‌ను ఆపుకోలేక ఓ బుడ్డోడు జూమ్‌లో నిర్వ‌హించిన క్లాసులోనే గుర్రుపెట్టి మరీ నిద్ర‌పోయాడు. అస్సలు మెలకువే లేదు..ఎంతగా నిద్రపోతున్నాడంటే…కుర్చీనే ప‌రుపుగా మారిపోయింది. ఆ కుర్చీ మీదనే వెల్ల‌కిలా ప‌డుకుండిపోయాడు.

క్లాస్ రూమ్ లో పిల్లలు కునికిపాట్లు పడుతుంటే..రేయ్ ఏంట్రా నిద్రపోతున్నావ్ లే..అంటూ బెత్తంతో కొట్టే టీచర్ లేదుగా…కానీ టీచర్ మాత్రం పాఠం చెబుతోంది ఎలాగంటే..ఆన్ లైన్ లో.అది కంప్యూటర్ లో ఈ పిల్లాడు వినాలి..నోట్స్ రాసుకోవాలి. కానీ ఆన్ లైన్ పాఠాలు కదా..తాను చెప్పిన పాఠం పిల్లలు వింటున్నారో లేదు పాఠాలు చెప్పే టీచర్ కు తెలీదు..దీంతో ఆ బుడ్డోడు జూమ్ పాఠాలు వినటం మానేసి గుర్రు పెట్టి కుర్చీలోనే శుభ్రరంగా నిద్రపోతున్నాడు అదే కరోనా చదువులంటే అన్నట్లుగా ఉంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో..మరి 2020 సంవత్సరం చదువంతా ఇలాగే గ‌డిచిపోయేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Related Posts