లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

దీక్షిత్ ను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష పడేలా చూస్తాం, దొరికిపోతాననే భయంతో హత్య చేశాడు – ఎస్పీ

Published

on

Deekshit Reddy:మహబూబాబాద్ లో 9 ఏళ్ల దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ విషాదంగా ముగియడం పట్ల ఎస్పీ కోటిరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దొరికిపోతాననే భయంతో నిందితుడు హత్య చేశాడని, ఈ ఘటనలో ఒక్కడే నిందితుడిన తేల్చామని ఎస్పీ వెల్లడించారు. మొదట డబ్బు డిమాండ్ చేయాలని అనుకుని..తర్వాత మనస్సు మార్చుకుని గొంతు పిసికి చంపేసిన అనంతరం పెట్రోల్ పోసి దహనం చేశాడన్నారు. దీక్షిత్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను 2020, అక్టోబర్ 22వ తేదీ గురువారం ఉదయం మీడియాకు వెల్లడించారు.‘ఓ ఛానెల్ లో పని చేస్తున్న రిపోర్టర్ రంజిత్ రెడ్డి పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి నాలుగో తరగతి చదువుతున్నాడు. 18వ తేదీ ఆదివారం పిల్లలను 5.40 గంటలకు రంజిత్ బయటకు తీసుకెళ్లి ఇంట్లో దింపాడు. అనంతరం సుమారు 6 గంటల ప్రాంతంలో దీక్షిత్ బయట ఆడుకుంటున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు దీక్షిత్ ను కిడ్నాప్ చేశారు. రాత్రి 9.15 గంటలకు పేరెంట్స్ కు కిడ్నాపర్ ఫోన్ చేశాడు.రూ. 45 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అదే రోజు తల్లిదండ్రులు కంప్లైట్ చేశారు. దీంతో తాము రంగంలోకి దర్యాప్తు ప్రారంభించాం. శనగపురం గ్రామంలో మూడు కోట్ల ప్రాంతంలో మందసాగర్ మెకానిక్. రంజిత్ రెడ్డి ఇంటికి దగ్గరలో ఇతను నివాసం ఉంటున్నాడు. కుటుంబపరంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇతనికి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యం ఉంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అప్పటికే రెక్కీ వేసి ఉన్న మందసాగర్..ఆడుకుంటున్న దీక్షిత్ రెడ్డిని వెహికల్ పై తీసుకెళ్లాడు.


దానవయ్య గుట్టలో దీక్షిత్ రెడ్డి మృతదేహం


ఈ విషయాన్ని తోటి స్నేహితులకు దీక్షిత్ తెలిపాడు. ఏ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉంటాయో అతనికి క్షుణ్ణంగా తెలుసు. ఆ మార్గంలో కాకుండా..ఇతర మార్గంలో దానవయ్య గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లాడు. కానీ..కిడ్నాప్ చేసిన అనంతరం ఏమి చేయాలో మందసాగర్ కు అర్థం కాలేదు. తనను గుర్తు పట్టాడని అనుకున్నాడు.ఈ విషయం బయటకు చెబితే..ప్రమాదం ఉంటుందని అనుకుని మనస్సు మార్చుకున్నాడు. దీక్షిత్ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కిడ్నాప్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ దారుణానికి తెగబడ్డాడు. కిడ్నాప్ చేసిన అనంతరం సాంకేతికతను ఉపయోగించి..కాల్ చేశాడని, దీక్షిత్ బతికే ఉన్నాడని నమ్మించాడు. ఇతర పోలీసుల సహాయంతో నిందితుడు ఎవరు ? బాలుడు ఎక్కడున్నాడో తెలుసుకున్నామన్నారు.తొలుత 23 మందిని అనుమానితులుగా గుర్తించి విచారించగా..మందసాగర్ ఒక్కడే చేశాడని ప్రాథమికంగా గుర్తించాం. ప్రస్తుతం ప్రాథమికంగా నిర్ధారించాం. విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయి. నిందితుడికి ఉరిశిక్ష పడే విధంగా చూస్తాం ’అని ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *