తండ్రితో ఆడుకొనే పిల్లల్లో సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ : సైన్స్ ఇంకా ఏం చెప్పిందంటే…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చిన్ననాటి నుంచి తండ్రితో కలిసి మెలిసి ఆడుకున్న పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ,లెగో ఫౌండేషన్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. తండ్రి ఉన్నాడనే ధైర్యం వారిలో మెండుగా ఉంటుందని తేలింది. ఆత్మ విశ్వాసం పెరగటంతోపాటు వారి భావోద్వేగాలను నియంత్రించుకునే విధానం పెరుగుతుందని అంటే..సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా ఉంటుందని తేలింది.ముఖ్యంగా చిన్న చిన్న విషయాలను కూడా గమనించటం మొదలు పెట్టే మూడు సంవత్సరాల వయస్సునుంచే పిల్లలు తమ తండ్రులతో ఆడుతూ పాడుతూ..సమయాన్ని గడిపేవారిలో ఈ విధానం ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. పిల్లలు తమ తండ్రితో ఆడుకునే విధానాన్ని ఈ సర్వే నిర్వాహకులు పరిశీలించగా..ఆ పిల్లలు తల్లితో ఆడే విధానానికి తండ్రితో ఆడే విధానానికి తేడా ఉందని గుర్తించారు.ఆ సమయాలలో వారి ఆట చాలా భిన్నంగా ఉంటుందని గుర్తించారు. ఇంకా చాలా చిన్నవయసులో (0 నుండి 3 సంవత్సరాల వయస్సు) పిల్లలతోపిల్లలు-తల్లులతో ఆడే విధానానికి, తండ్రితో ఆడుతున్న విధానం భిన్నంగా ఉందా అనే కోణంలో పరిశోధన చేపట్టగా తండ్రితో ఆడుకునే పిల్లల్లో సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుందని తెలిపారు.

తండ్రులు ,తల్లుల మధ్య చాలా సారూప్యతలు ఉన్నప్పటికీ..తండ్రులు చిన్న పిల్లలతో శారీరక ఆటలలో పాల్గొంటారని, టిక్లింగ్, చేజింగ్,పిగ్గీ-బ్యాక్ రైడ్స్ వంటి కార్యకలాపాలను ఎంచుకుంటారని పరిశోధనలో తేలింది. పిల్లలు వారి భావాలను..భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇటువంటి క్వాలిటీస్ వారి భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా స్కూల్ చదువుల్లోను ఆటల్లోను..యాక్టివిటీలోను వారి ప్రవర్తనను కంట్రోల్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. వారిని మరింత మెరుగుపరుస్తుంది.కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్లే ఇన్ ఎడ్యుకేషన్, డెవలప్‌మెంట్ అండ్ లెర్నింగ్ ప్రొఫెసర్ పాల్ రామ్‌చందాని ఈ విషయంపై మాట్లాడుతూ..తండ్రి-పిల్లల ఆటల ప్రభావం వారి జీవితాల్లో చాలా ఉపయోగపడేవిధంగా ఉంటుందన్నారు. తండ్రితో ఆడుకునే సమయాన్ని పిల్లలు చాలా ప్రభావితమవుతారని అన్నారు.

LEGO ఫౌండేషన్ డాక్టర్ సియారా లావెర్టీ మాట్లాడుతూ..తండ్రులకు, తల్లులకు, పిల్లలు ఊహ తెలుస్తున్న సమయంలో పిల్లలతో ఆడుకోవడానికి టైమ్..ఆడుకునేందుకు సరైన ఆట స్థలాలు చాలా అవసరమని తెలిపారు. ఇవి చాలా అవసరమని పిల్లల్లో మానసిక ఉల్లాసానికి..మంచి ఆలోచనలు ఏర్పడటానికి..తోటి పిల్లలతో కలిసి మెలిసి ఆడుకోవటం చాలా అవసరమని తెలిపారు.పిల్లల జీవితంలో మొదటి సంవత్సరాల్లో తల్లిదండ్రుల-పిల్లలతో కలిసి ఆడుకోవటం చాలా అవసరమనీ..సామాజికాంశాల పట్ల వారు అవగాహనతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగటానికి ఉపయోగపడుతుందన్నారు. కేంబ్రిడ్జ్ సమీక్ష 1977 మరియు 2017 మధ్య చేపట్టిన 78 అధ్యయనాల నుండి డేటాను ఉపయోగించింది-వాటిలో ఎక్కువ భాగం యూరప్ లేదా ఉత్తర అమెరికాలో ఉన్నాయి. తండ్రులు మరియు పిల్లలు ఎంత తరచుగా కలిసి ఆడుతారు, ఆ ఆట యొక్క స్వభావం మరియు పిల్లల అభివృద్ధికి ఏవైనా సంబంధాలు ఉన్నాయో అనే విషయాల కోసం పరిశోధకులు సమగ్ర సమాచారాన్ని విశ్లేషించారు.

READ  సీఎం అభయం: ఇద్దరు అధికారులు సస్పెండ్

సగటున, చాలా మంది తండ్రులు ప్రతిరోజూ తమ బిడ్డతో ఆడుకుంటున్నారని వారు కనుగొన్నారు. చిన్న పిల్లలతో కూడా, తండ్రి-పిల్లల ఆట మరింత శారీరకంగా ఉంటుంది. పిల్లలతో, అంటే వాటిని తీయడం లేదా వారి అవయవాలను శాంతముగా పెంచడానికి మరియు వారి బలాన్ని ప్రదర్శించడానికి వారికి సహాయపడటం; పసిబిడ్డలతో, తండ్రులు సాధారణంగా వెంటాడుతున్న ఆటల వంటి ఘోరమైన, కఠినమైన మరియు దొర్లే ఆటలను ఎంచుకుంటారు.సర్వేలో తేలిన అన్ని అధ్యయనాలలో..తండ్రి-పిల్లల ఆట వారి భావాలను నియంత్రించే సామర్థ్యం మధ్య స్థిరమైన సంబంధం ఉందని తేల్చి చెప్పారు నిర్వాహకులు. తండ్రులతో ఆడుకోవటానికి పిల్లలు చాలా చాలా ఇష్టపడుతుంటారని..ఆ ఆటను వారి చిన్ని మనస్సులు ఆస్వాదిస్తారని..అటువంటి పిల్లలు హైపర్ యాక్టివిటీలుగానూ..సెల్ఫ్ కంట్రోల్ పెంచుకోవటంలో సఫలీకృతులవుతారని తెలిపారు. తండ్రులతో ఆడుకునే పిల్లలు దూకుడును నియంత్రించడంలో మెరుగ్గా కనిపించారనీ..స్కూల్లో తోటి పిల్లలతో వచ్చిన గొడవల విషయంలో కూడా ఇతర పిల్లలతో పేచీలు పెట్టుకోవటం వారిని కొట్టటం వంటి పలు దూకుడు విషయాల్లో చాలా సంయవనంతో మెలగే అవకాశం ఉందనితెలిపారు.

పిల్లలకు శారీరక ఆట వారి మనస్సుల్ని ఉత్తేజపరుస్తుంది. వారికి ఉత్తేజకరమైన పరిస్థితులను సృష్టిస్తుందని మరో పరిశోధకులు రామ్‌చందాని అన్నారు. వీటికి కొన్ని ఉదాహరణలకు చెబుతూ..తండ్రి పిల్లలతో కలిసి ఆడుతున్నప్పుడు తోటి పిల్లలతో ఆడుతున్నప్పుడు తండ్రి తప్పొప్పులను సరిచేస్తుండాలి. తోటి పిల్లలు కొట్టినా..దెబ్బలు తగిలినప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయాలి. అది వారికి జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ ని పెంచటానికి ఉపయోగపడుతందని తెలిపారు. అటువంటి సమయాల్లో పిల్లలు ఎలా స్పందించాలో ప్రాక్టీస్ గా చెబుతుండాలి.చిన్నతనంలోనే తండ్రి-పిల్లల ఆట క్రమంగా పెరుగుతుందని..తరువాత ‘మధ్య బాల్యం’ అంటే (6 నుండి 12 సంవత్సరాల వయస్సు) వరకు తగ్గుతుందని ఈ అధ్యయనం కొన్ని ఆధారాల ద్వారా నిరూపించబడింది. చిన్నపిల్లలు తమ సొంత ఇంటిని దాటి ప్రపంచాన్ని గమనించటం మొదలుపెట్టినప్పుడు..ముఖ్యంగా స్కూల్స్ లో వారు ఎదుర్కొనే సవాళ్ల గురించి మాట్లాడటానికి శారీరక ఆట చాలా ముఖ్యమైనదని తేలింది.

Related Posts