Wild Dog: విజయ్ వర్మ టీమ్ ఇదే!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Wild Dog-Nagarjuna: ‘కింగ్’ నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాలయాల్లో మొదలైంది. తాజాగా రోహ్‌తంగ్ పాస్‌లో తీసిన వీడియోను నాగార్జున ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. సముద్ర మట్టానికి 3980 మీటర్ల ఎత్తులో తాము ఉన్నామని, ఇది చాలా డేంజరస్ ప్రాంతమని నాగార్జున పేర్కొన్న సంగతి తెలిసిందే.


య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా పాత్ర‌ను చేస్తున్నారు. క్రిమిన‌ల్స్‌ను నిర్దాక్షణ్యంగా డీల్ చేసే విధానం వ‌ల్ల సినిమాలో ఆయ‌న‌ను ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. తాజాగా విజయ్ వర్మ గెటప్‌లో తన టీమ్‌తో కలిసిఉన్న ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు నాగ్.


నాగార్జునకు జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాస్తుండ‌గా, షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Related Tags :

Related Posts :