మా బ్యాంక్ మీ నగల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కింగ్ ఆఫ్ కామెడీ టైమింగ్ అల్లరి నరేష్ మరోసారి తన మార్క్ వినోదంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. పి వి గిరి దర్శకత్వంలో, నరేష్, పూజా ఝవేరి జంటగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’.. నరేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. బ్యాంక్ లాకర్లో నగలు మాయమవడం, పోలీసులు వాటిని వెతకడం.. మధ్యలో హీరోకి ఓ లవ్ ట్రాక్.. ఇదే కథ అని క్లుప్తంగా చూపించారు.

టీజర్ చూస్తుంటే నరేష్ మరోసారి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తాడనిపిస్తోంది. పూజా గ్లామరస్‌గా కనిపించింది. సతీష్ ముత్యాల విజువల్స్, సాయి కార్తీక్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్: గాంధీ, ఫైట్స్: రియల్ సతీష్, ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ.

Read:విడుదల వెండితెర మీదే.. రెండు పండగలకు రెండు సినిమాలు..