King Of Poverty-Ridden Eswatini Buys 19 Rolls-Royce Cars Worth Rs 175 Crores For His 15 Wives

ప్రజలు ఆకలి కేకలు పెడుతుంటే..తన 15మంది భార్యలకు Rs.175 కోట్ల లగ్జరీ కార్లు కొన్న రాజు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించేవాడే రాజు. కానీ కరోనా కష్టకాలంలో ప్రజలు ఆకలి కేకలు పెడుతుంటే..అన్నమో రామచంద్రా అని అల్లాడిపోతుంటూ స్వాజిలాండ్ రాజ్యాన్ని పాలిస్తున్న ‘మస్వతి-111కు ఏమాత్రం పట్టలేదు. తన జల్సాలు..తన భార్యలో ఖుషీ ఖుషీగా గడిపేస్తున్నాడు ఈ బహుభార్యకోవిదుడు. భార్యలు అంటున్నారేమిటి అనుకోవచ్చు..అవును మరి స్వాజిలాండ్ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు మస్వతికి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురుకూడా కాదుఏకంగా 15మంది భార్యలున్నారు. ఆ 15మంది భార్యలతో జల్సాలు చేసుకోవటం తప్ప ప్రజల బాధలు పట్టించుకోడు. 

కరోనా కరాళ నృత్యంతో అగ్రదేశాలు కూడా ఆకలితో అల్లాడిపోతున్న క్రమంలో అసలే కరువు దేశం. పైగా కరోనా దెబ్బతో ఆకలితో అల్లాడిపోతున్నారు స్వాజిలాండ్ దేశస్థులు. కాగా..అగ్రరాజ్యాలకు ఆకలి కేకలు కొత్తే. కానీ ఆఫ్రికా దేశాలకు ఆకలి బాధలు కొత్తకాదు. అందులోని స్వాజిలాండ్ దేశానికి ఏమాతరం ఆకలి కేకలు కొత్తేమీ కాదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పేదిరికాన్ని అనుభవిస్తున్న దేశం స్వాజిలాండ్. అసలే దరిద్రం తాండివిస్తున్నదేశం.పైగా రాజరిక పాలన.ఇక ప్రజల కష్టాలకు అంతేలేదు. ఇవేవీ ఏమాత్రం పట్టించుకోని రాజు పాలనలో కష్టాలు కండగండ్లతో బతికేస్తున్నారు ఆదేశ ప్రజలు. కానీ రాజుగారి జల్సాలు అనుభవించటంలో  ఏమాత్రం తగ్గడు.

ఆ దేశంలోని ఈస్వతిని (స్వాజిలాండ్) రాజ్యాన్ని పాలిస్తున్న రాజు సోకులు చూస్తే మాత్రం.. ఆ దేశం కరువుతో అల్లాడుతుందని అస్సలు అనిపించదు. ఆ దేశ పేదలు ఆకలి చావులతో చనిపోవడానికి అతడి జల్సాలు కూడా కారణమేనంటారు విశ్లేషకులు. 

స్వాజీ రాయల్ ఫ్యామిలీకి చెందిన మస్వతి-III రాజు‌కు ఏకంగా 15 మంది భార్యలు ఉన్నారు. వారికి రాజభోగాలన్ని అందుబాటులో ఉంటాయి. అడుగులకు మడుగులొత్తే నౌకర్లు, చాకర్లకు కొదువ లేదు. భార్యలకు మస్వతి కాస్ట్లీ గిఫ్టులు ఇస్తుంటాడు. అతడి ప్రస్తుతం 19 రోల్స్ రాయిస్ సెడాన్ కార్లు ఉన్నాయి. వాటి విలువ రూ.1.9 కోట్లు. 

అవి సరిపోవన్నట్లుగా మస్వతి ఇటీవల తన భార్యలకు గిఫ్టుగా ఇచ్చేందుకు ఏకంగా 120 బీఎండబ్ల్యూ కార్లు ఆర్డర్ చేశాడు. వీటి విలువ రూ.175 కోట్లు అని అంచనా.

ఈస్వతినికి వచ్చే నిధుల్లో సగం ఇతడి కుటుంబాన్ని పోషించడానికే సరిపోతాయి. ఆ రేంజ్ లో ఉంటుంది వారి జల్సాలు. అతడి 15 మంది భార్యలకు 15 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పటికే వీరికి రకరకాల కాస్ట్లీ కార్లు ఉన్నాయి. వారి గ్యారేజీలో ప్రస్తుతం 20 మెర్సిడెస్-మేబాచ్ ఎస్600 పుల్‌మ్యాన్, 62 మేబాచ్, బీఎండబ్ల్యూ X6 కార్లు ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ జెట్లు కూడా ఉన్నాయి. 

రాజు తన విలాసాల కోసం పెడుతున్న ఈ ఖర్చులపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా ఐడోంట్ కేర్ అంటాడు మస్వతి.  ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నాడని విమర్శలు సంధిస్తున్నా పెడచెవిన పెడతాడు. రని..ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాలని ప్రతిపక్షాల డిమాండ్ లను ఏమాత్రం పట్టించుకోడు. అయితే, ఆ రాజు కార్లను కొనుగోలు చేసింది 2019, అక్టోబరులో. అంటే అప్పటికే కరోనా కష్టాలు వచ్చిన క్రమంలోనే ఈ కార్లనుకొన్నాడు.దీనికి సంబంధించిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలు ఆకలితో అల్లాడిపోతుంటూ నీకు ఈ సోకులేంటిరా బాబూ..నువ్వు రాజువా రాక్షసుడివా? నియంతవా? అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.

కాగా..ఈరాజు కాస్ట్లీ కార్లు కొన్నది గత సంవత్సరమే అయినా..ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఇది మరోసారి తెరమీది వచ్చి రాజుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read: అధికంగా నీళ్లు తాగించి కన్నకొడుకుని చంపిన తల్లిదండ్రులు

Related Posts