ఈసారి ఎక్కువ సీట్లు రాకుంటే కష్టమే, గ్రేటర్ పై కిషన్ రెడ్డి స్పెషల్ ఫోకస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

kishan reddy: గ్రేటర్ ఎలక్షన్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో.. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ నేతల దృష్టి.. హైదరాబాద్ గల్లీకి మళ్లింది. గ్రేటర్‌పై పట్టుకోసం బీజేపీ తెగ ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిపై.. కిషన్ రెడ్డి కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి.. ప్రజల్లోకి వెళ్లేందుకు.. బీజేపీ నాయకులు రచిస్తున్న వ్యూహమేంటి? ఢిల్లీ ప్లాన్.. హైదరాబాద్‌లో వర్కవుట్ అవుతుందా?

సికింద్రాబాద్‌పై కిషన్ రెడ్డి ఫోకస్:
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. సికింద్రాబాద్‌పై ఫోకస్ పెట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని కార్పొరేషన్ స్థానాల్లో.. బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారట. ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు కిషన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికలు, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకు సిద్ధం కావాలని సమాయత్తం చేస్తున్నారు.

వాటి గురించి ప్రజల్లో బాగా ప్రచారం చేయాలని ప్లాన్:
కరోనా టైంలో ప్రజలను ఆదుకున్న పార్టీ బీజేపీయేనని.. తాము చేసిన సేవలను, ఆత్మనిర్భర్ భారత్ లాంటి అంశాలను.. ప్రజల్లో బాగా ప్రచారం చేయాలని ప్లాన్ చేశారట కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా నుంచి ప్రజలను కాపాడకుండా గాలికొదిలేసిన అంశాలను.. జనాల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారట. ఇక సంస్థాగతంగా బలోపేతం కావడానికి యాక్టివ్‌గా ఉన్న వారిని.. బూత్ కమిటీల్లోకి తీసుకొని.. బూత్ కమిటీలు, డివిజన్ కమిటీలు, మోర్చా టీంలు గట్టిగా పనిచేసేలా ఆలోచన చేస్తున్నారు.

డిసెంబర్ నాటికి బెంగాల్ లో రాష్ట్రపతి పాలన


బీజేపీ కార్యకర్తలు కసిగా పనిచేస్తే.. ఈసారి ఎక్కువ సీట్లు:
సికింద్రాబాద్ పార్లమెంట్‌ పరిధిలోని బీజేపీ కార్యకర్తలు కసిగా పనిచేస్తే.. ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని దిశానిర్దేశం చేశారట కిషన్ రెడ్డి. అంతర్గత విభేదాలు పక్కనబెట్టి.. గెలుపే లక్ష్యంగా అంతా పనిచేయాలని చెప్పారట. ముఖ్యంగా.. కేసీఆర్ కుటుంబపాలనపై ఎదురుదాడి చేయాలని, ఈ విషయాన్ని.. బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అంతర్గత సమావేశాల్లో కార్యకర్తలకు సూచిస్తున్నారట. సోషల్ మీడియాలోనూ టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టేలా.. వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.

కేంద్రమంత్రిగా ఉండి.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో.. మెజారిటీ సీట్లు గెలవకపోతే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని.. కిషన్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే.. ఇప్పడు స్పెషల్ ఫోకస్ పెట్టారని పార్టీలో చర్చ జరుగుతోంది.

Related Tags :

Related Posts :