Kite Festival

పతంగుల పండుగ వచ్చెనండీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కాగితంతో చేసిన గాలిపటాలను సైనికులకు సందేశాలు పంపించడానికి వినియోగించేవారట. చైనాకు చెందిన సేనాపతి క్రీస్తు పూర్వం

సంక్రాంతి వస్తుందంటే చాలు 15 రోజుల ముందు నుంచే సందడి. కింద కింద ముగ్గులు.. పైన పతంగులు. ఎటు చూసినా కలర్ ఫుల్. ఇళ్ల ముందు రంగవల్లులతో కొత్త అందాలు వస్తే.. రంగు రంగుల పతంగులతో ఆకాశం ఇంద్రధనుస్సును తీసుకొస్తోంది. గాలిపటాల ఎగురవేతలో పోటీ పిల్లలను కేరింత కొట్టిస్తోంది.
గాలిపటం ఎలా పుట్టింది :
గాలిపటం చైనా దేశంలో పుట్టిందనే ప్రచారం ఉంది. 3 వేల సంవత్పరాల క్రితమే చైనా పరిచయం చేసింది. హేన్ వంశపు రాజుల పాలనలో గాలిపటం మూలాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అక్కడి నుంచి ప్రపంచానికి పరిచయం అయినట్లు చరిత్రకారుల మాట. ప్రాచుర్యంలో ఉన్నవాటిలో ఎక్కువగా వినిపించేది చైనా నుంచి పుట్టిన కథే. వేలాది సంవత్సరాలుగా గాలిపటాలను ఎగురవేసే సంస్కృతి సంప్రదాయంగా వస్తుంది. కాగితంతో చేసిన గాలిపటాలను సైనికులకు సందేశాలు పంపించడానికి వినియోగించేవారట. చైనాకు చెందిన సేనాపతి క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో తన సైనికులకు పతంగుల ద్వారా గుప్త సందేశాలు పంపేవాడని చరిత్ర చెబుతుంది. 19వ శతాబ్దంలో పతంగితో కెమెరాను జతచేసి ఎత్తుకు ఎగురవేసి, పై నుంచి భూమిని ఫొటోలు తీయడం జరిగిందటా.
పిల్లల సందడే ఎక్కువ :
సంక్రాంతి అంటే పిల్లలకు పతంగులు, రైతులకు పంటలు, యువతులకు గొబ్బెమ్మలు. సంక్రాంతి సందర్భంగా గాలిపటాలను ఎగురవేయడం సంప్రదాయం. స్కూల్స్ కు సంక్రాతి సెలవులు ఇస్తే చాలు పతంగులు పట్టుకుని ఇంటి డాబాపైకి చేరటం కామన్. పిల్లలతో పాటు యువకులు సైతం వీటిని ఎగురవేస్తారు. ఇటీవల విభిన్న ఆకారాల్లో, వినూత్న రంగుల్లో గాలిపటాలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల గాలిపటాల పోటీలు కూడా పెడతారు. పిల్లలే కాదు పెద్దలు సైతం గాలిపటాలు ఎగురవేసి సంబరపడతారు. ప్రతి సంవత్సరం జనవరి 14న ఈ పంతంగుల వేడుక ఉంటుంది. మన దేశంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులను ఎగరవేసే సంప్రదాయం అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్నది. అంతర్జాతీయ పతంగుల పండుగకు భాగ్యనగరం వేదిక కూడా కావటం విశేషం.
 

Related Posts