విజయ్‌ని కలిసిన వరుణ్ చక్రవర్తి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన తమిళనాడు మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, ఐపీఎల్ 13 వ సీజన్‌లో రాణించి టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఐదు వికెట్ల క్లబ్‌లో చేరిన తొలి బౌలర్‌గా ఐపీఎల్‍‌13లో రికార్డ్ క్రియేట్ చేసిన వరుణ్.. అంతకుముందు తమిళనాడు లీగ్‌లలోనూ అలరించాడు. అయితే ఐపీఎల్ తర్వాత వరుణ్ సెలబ్రిటీగా మారిపోగా.. ఈ సమయంలోనే తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు.తమిళనాడుకు చెందిన వరుణ్‌కు హీరో దళపతి విజయ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో విజయ్‌ని కలవాలని వరుణ్‌కి కోరిక.. ఇప్పుడు ఐపీఎల్ తర్వాత ఎట్టకేలకు విజయ్ కోరిక నెరవేరింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడి తన సత్తా చాటుకున్న వరుణ్, తన అనుభవాలను ఈ సంధర్భంగా విజయ్‌తో పంచుకున్నాడు.ద‌ళ‌ప‌తి విజ‌య్ ఆఫీసుకు వెళ్లి మ‌రీ వ‌రుణ్ కలుసుకోగా.. ఈ సంద‌ర్భంగా దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ అభిమానులతో పంచుకున్నాడు వరుణ్. ఒకే ఫ్రేములో క‌నిపించిన ఇద్ద‌రు సెల‌బ్రిటీల‌ను చూసి ఆనందిస్తున్నారు వారి అభిమానులు. ఇక విజ‌య్ న‌టిస్తోన్న మాస్ట‌ర్ సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి ఈ ఏడాది ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన జట్టులో అవకాశం లభించినా కూడా భుజం నొప్పితో చివర్లో సిరీస్‌కు దూర‌ం అయ్యారు.

Related Tags :

Related Posts :