లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు కేఎల్ రాహుల్ దూరం

Published

on

KL Rahul: కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో జరగనున్న మరో రెండు టెస్టులకు దూరం కానున్నాడు. ట్రైనింగ్ లో గాయం కావడంతో వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ సుదీర్ఘ ఫార్మాట్ లోని తొలి రెండు మ్యాచ్ లలో ఆడలేదు. సిరీస్ లోని తర్వాతి 2మ్యాచ్ లలో ఆడించేందుకు సిద్ధమైంది మేనేజ్మెంట్. ఈ క్రమంలో ప్రాక్టీస్ చేస్తున్న రాహుల్ మణికట్టుకు గాయమైంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లోని నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని ప్రతినిధులు అంటున్నారు.

‘కేఎల్ రాహుల్ ఎడమచేతి మణికట్టుకు గాయమైంది. శనివారం టీమిండియా ప్రాక్టీస్ లో భాగంగా ఈ ఘటన జరిగింది. వికెట్ కీపర్ – బ్యాట్స్‌మన్ మరో రెండు టెస్టులకు కూడా అందుబాటులో ఉండడు. దీని నుంచి రికవరీ అవడానికి దాదాపు మూడు వారాల సమయం పడుతుందని ‘ బీసీసీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు.

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకుని కేఎల్ రాహుల్ రిహాబిలేషన్ లో ఉంటారు. లిమిటెడ్ ఓవర్ సిరీస్ లో సూపర్ ఫామ్ లో దూసుకెళ్తున్న రాహుల్.. ఇటీవల విన్నింగ్స్ మ్యాచ్ లలో కీలకంగా వ్యవహరించాడు.

టీమిండియా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జనవరి 7న మూడో టెస్టు ఆడనుంది. ఇప్పటి వరకూ ముగిసిన రెండు టెస్టుల్లో ఇరు జట్లు 1-1 సమమైన ఫలితాలతో కొనసాగుతుంది. క్వారంటైన్ పూర్తయిపోవడంతో రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి చేరతాడని భావిస్తున్నారు క్రికెట్ అభిమానులు.