Know why Sunny Leone is the Top Googled celebrity in India

సన్నీలియోన్ కోసం తెగ వెతుకుతున్నారంట

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత ఫేమస్ సన్నీలియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో సన్నీ ఒకరు. 2012లో జిస్మ్2 థ్రిల్లర్ మూవీతో బాలీవుడ్ లోకి సన్నీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాలో కూడా సన్నీ నటించింది. మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ,యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాలో సన్నీ నటించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు తన టిక్‌టాక్ వీడియోలకు చాలా ఫేమస్.

	S2.jpg

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం సర్ ప్రైజ్ చేస్తూ…మనదేశంలో గూగుల్ లో ఎక్కువమంది వెతికిన వారి లిస్ట్ లో టాప్ లో ఉంది సన్నీలియోన్. అయితే సన్నీని మనదేశంలో ఎక్కువమంది గూగుల్ లో సెర్చ్ చేయడానికి కారణం ఆమె వీడియోలే. అయితే మణిపూర్ అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాల నుంచే పెద్ద సంఖ్యలో సన్నీలియోన్ కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారని తెలిసింది. తన కోసం నిరంతరం ఉన్న తన అభిమానులందరికీ, తన బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని సన్నీ చెప్పారు.

	SUN.jpg

భారతదేశంలో మోస్ట్ గూగుల్డ్ ​​సెలబ్రిటీగా ఉండటాన్ని సన్నీ అద్భతం,గొప్పగా భావిస్తోంది.మోస్ట్ గూగుల్డ్ సెలబ్రిటీ లిస్ట్ లో సన్నీలియోన్ అగ్రస్థానంలో ఉండటం ఇది రెండోసారి. అంతకుముందు కూడా మోస్ట్ గూగుల్డ్ సెలబ్రిటీగా సన్నీ ఉంది. 2011లో మ్యూజిషియన్ అయిన డానియల్ వీబర్ ని సన్నీ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకొని వారిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. సన్నీ మనసు నిజంగా వెన్న అని ఆమె అభిమానులు అంటుంటారు.

	S3.jpg

 

Related Tags :

Related Posts :