జగన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిన వైసీపీ ఫైర్ బ్రాండ్.. ఏం జరుగుతుందో, ఎటు దారితీస్తుందోనని టెన్షన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

kodali nani.. ఏపీ మంత్రి కొడాలి నాని అంటే ఫుల్‌ మాస్‌ లీడర్‌. ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా అలానే ఉంటుంది. మంత్రి అయ్యాక కొడాలి నాని చేస్తున్న ప్రతీ కామెంట్ హాట్ టాపిక్కే అవుతోంది. అయితే తాజాగా కొడాలి నాని చేస్తున్న కామెంట్స్ మాత్రం ఏపీ రాజకీయాల్లో అగ్గిని రాజేస్తున్నాయి. సాధారణంగా ప్రతిపక్షాలపై కొడాలి నాని కామెంట్స్ బాగా పేలుతూనే ఉంటాయి. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాలపై కామెంట్స్ చేయాలన్నా, విమర్శలు ఎక్కుపెట్టాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా ఉంటాయి. ఇటీవల రాజధానిపై చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దంటూ చేసిన కామెంట్స్ సెగ రేపాయి.
వ్యహారం ఎక్కడికి దారితీస్తుందోననే టెన్షన్‌:
అవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా దేవాలయాలపైనా.. ముఖ్యంగా తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్‌పై కొడాలి నాని చేసిన కామెంట్స్ అలజడినే రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందోననే టెన్షన్‌ ఇప్పుడు రాష్ట్రంలో మొదలైంది.

నోరు జారితే అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి అపకీర్తి:
మరోపక్క, వరసపెట్టి కొడాలి నాని చేస్తున్న కామెంట్స్ వైసీపీకి కూడా ఇబ్బందిగా మారాయని అంటున్నారు ఆ పార్టీలోని కొందరు నేతలు. సున్నితమైన అంశాల్లో ఆచితూచి మాట్లాడాలని, ఇలా కామెంట్స్‌ చేయడం వల్ల అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి అపకీర్తి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా దేవాలయాల్లో ఘటనలపై చేసిన కామెంట్స్ మరింత ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. ఇలాంటి కామెంట్స్ చెయ్యడంతో పార్టీపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిజం అనే భావన ప్రజల్లో కలిగే ప్రమాదం ఉంటుందనే వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి.
నాని రాజేసిన మంటలు ఎంత వరకూ వ్యాప్తి చెందుతాయోననే టెన్షన్‌:
అదే సమయంలో కొడాలి నాని కామెంట్స్‌పై ఓ వర్గం నేతలు మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారు. ఆయన ఏం మాట్లాడినా దాని వెనుక పక్కా వ్యూహం ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వంతో పాటు సీఎంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానంగానే కొడాలి నాని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఆయన రాజేసిన మంటలు ఎంత వరకూ వ్యాప్తి చెందుతాయోననే టెన్షన్‌ మాత్రం అన్ని వర్గాల్లోనూ కనిపిస్తోందట.

మొత్తానికి కొడాలి నాని కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపితే.. పార్టీలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలంటన్నారు.

READ  పాకిస్తాన్ నుంచి వచ్చిన ముగ్గురికి భారత పౌరసత్వంRelated Posts