Home » సినీ పుత్రుడు : కోడి రామకృష్ణ నటుడిగా ప్రయత్నాలు
Published
2 years agoon
By
madhuసీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా పెరలాసిస్ వ్యాధితో బాధ పడుతున్నారు. గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పాలకొల్లులో నరసింహ మూర్తి, చిట్టెమ్మ దంపతులకి జులై 23 కోడి రామకృష్ణ జన్మించారు. ఎన్నో చిత్రాలు నిర్మించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. వెండి తెరపై గ్రాఫిక్ మాయాజాలాన్ని చూపించాడు. ప్రతొక్క జోనర్ని టచ్ చేశారు. రాజకీయ చిత్రాలు..భక్తి రస చిత్రాలు..ఇలా ఎన్నో వైవిధ్యమైన కథా చిత్రాలు రూపొందించాడు. దర్శకరత్న దాసరి నారాయణ రావు శిష్యుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు.
Read Also:స్టయిలిష్ డైరెక్టర్ : హెడ్ బ్యాండ్, వీరతిలకం, చేతికి దారాలు..
తొలినాళ్లలో కోడి రామకృష్ణ నటుడిగా కూడా ప్రయత్నాలు చేశారట. ఆ మక్కువని వదిలిపెట్టని ఆయనకి మద్రాసులో అడుగుపెట్టిన తొలి రోజే అనుకోకుండా ఆయనతో ‘స్వర్గం నరకం’లో ఓ చిన్న పాత్ర చేయించారట. ఆ తర్వాత ‘రాధమ్మ పెళ్లి’, ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘చదువు సంస్కారం’ చిత్రాల్లో నటించారు. కథానాయకుడిగా ‘మా ఇంటికి రండి’ అనే చిత్రంలో కూడా నటించారు. అయితే ఆ చిత్రం విజయవంతం కాలేదు. మంచి దర్శకుడిగా, రచయితగా, నటుడిగా గుర్తింపుని తెచ్చుకొన్నారు కోడి రామకృష్ణ. పలు నంది పురస్కారాలతో పాటు, రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కూడా స్వీకరించారు.
Read Also:కోడి రామకృష్ణ కన్నుమూత
Read Also:దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ సినీ మైలురాళ్లు