లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

విడాకుల బాటలో బాలీవుడ్ జంట..

బాలీవుడ్‌లో రీమేక్స్, బయోపిక్‌లతోపాటు విడాకులు పరంపర కూడా కొనసాగుతోంది…

Published

on

Konkona Sen Sharma And Ranvir Shorey Officially Files For Divorce After Living Separately For Last 5 Years

బాలీవుడ్‌లో రీమేక్స్, బయోపిక్‌లతోపాటు విడాకులు పరంపర కూడా కొనసాగుతోంది…

ముంబై : బాలీవుడ్‌ నటి, రచయిత్రి, దర్శకురాలు కొంకణా సేన్‌ శర్మ తాజాగా విడాకులకు దరఖాస్తు చేశారు. కొంకణా తన సహనటుడు రణ్‌వీర్‌ షోరేను 2010లో వివాహం చేసుకుంది. ‘ట్రాఫిక్‌ సిగ్నల్‌’, ‘మిక్స్‌డ్‌ డబుల్స్‌’, ‘ఆజా నాచ్‌లే’ వంటి సినిమాలో కలిసి నటించిన ఈ జంట.. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2007 నుంచి 2010 వరకూ సహజీవనం చేశారు.

అనంతరం 2010లో వివాహం చేసుకుని,  2015లో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ.. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించారు.  వీరికి ఆరేళ్ల కుమారుడు హరూన్‌ ఉన్నాడు. ఇద్దరూ విడిగా ఉంటూనే కుమారుడి బాధ్యతలు చూసుకుంటున్నారు. 2015లో దూరమైన ఈ జంట ఇప్పటి వరకు విడాకులు తీసుకోకపోవడం కొసమెరుపు.

ఈ క్రమంలో తాజాగా వీరు అధికారికంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తవ్వగా.. ఆరునెలల్లో అధికారికంగా విడాకులు అందనున్నట్లు సమాచారం. వీరిద్దరూ కౌన్సెలింగ్ తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

See Also>>వడివేలు ఫీమేల్ వెర్షన్ రష్మిక ఫోటోలు చూశారా!

Konkona Sen Sharma And Ranvir Shorey Officially Files For Divorce

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *