లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

PSలోకి IPS సడెన్ ఎంట్రీ..గుర్తు పట్టని మహిళా పోలీస్..పనిష్మెంట్ ఇచ్చిన అధికారిణి

Published

on

Krala  kochi  PS IPS Sudden entry with Civil Dress: అది కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్. అక్కడికి సడెన్ గా ఓ వాహనం వచ్చి ఆగింది. దాంట్లోంచి ఓ మహిళా ఠీవీగా నడస్తూ పోలీస్ స్టేషన్ లోకి నడుచుకుంటూ వచ్చారు. ఎవరో ఓమహిళ స్టేషన్ లోకి నేరుగా వచ్చేయటం అక్కేడే ఉన్నా ఓ మహిళా పోలీస్ పట్టించుకోలేదు.

ఆ తరువాత ఎవరో ఒకామె నేరుగా స్టేషన్ లోకి వచ్చేయటం చూసి గబగబా వచ్చిన సదరు మహిళా పోలీస్ ‘‘ఏయ్..ఎవరు నువ్వు..ఇలా ఇష్టమొచ్చినట్లుగా స్టేషన్ లోకి వచ్చేస్తున్నావ్’’అని ప్రశ్నించింది. దానికి ఆమె ‘‘నేనెవరోతెలీదు కదూ..చెబుతానుండు’’అంటూ తాపీగా వెళ్లి స్టేషన్ లో ఉన్నతాధికారులు కూర్చునే కుర్చీలో కూర్చుంది అచ్చు సినిమాలోలాగా..

అదిచూసిన సదరు మహిళా పోలీసుకు దిమ్మ తిరిగిపోయింది. ‘‘సారీ..సారీ మేడమ్ మీరు సివిల్ డ్రెస్ లో ఉన్నారు కదా..అందుకే గుర్తు పట్టలేకపోయాను’’అంటూ కంగారుపడుతూ..భయపడుతూ సెల్యూట్ చేసింది.

ఇంతకీ అలా ఠీవీగా స్టేషన్ లోకి వచ్చిన ఆ మహిళ ఓ IPS. ఆమె DCP ఐశ్వర్య డోంగ్రే. కేరళలోనే అతి చిన్నవయస్సులోనే IPS అయిన ఐశ్వరా డోంగ్రే. అది తెలుసుకున్న ఆ మహిళా పోలీస్ కు ఒకటే కంగారుపట్టుకుంది.

DCP ఐశ్వర్య డోంగ్రే గత ఆదివారం (జనవరి 10,2021) టౌన్ నార్త్ స్టేషన్ ప్రక్కనే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి క్లీనింగ్ డ్రైవ్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రెస్ లో వచ్చారు. కానీ ఆ వచ్చినామె ఎవరో పాపం ఆ మహిళా అధికారి గుర్తు పట్టలేక మీరెవరు? అని అడిగింది. తరువాత ఆమె ఎవరో తెలుసుకుని క్షమాపణలు చెప్పి సెల్యూట్ చేసింది.

కానీ DCP ఐశ్వర్య ఊరుకోలేదు. పోలీస్ స్టేషన్ లోకి ఓ అధికారిక వాహనం వచ్చి ఆగింది. కానీ స్టేషన్ లో ఉన్న సిబ్బంది ఎవరూ గుర్తించలేదు..కనీసం స్టేషన్ లోకి వచ్చిన తరువాత కూడా గుర్తించలేదు. ఇదేనా మీరు చేసే డ్యూటీ..ఇదేనా అప్రమత్తత? అంటూ దీనికి మీ సమాధానం ఏంటీ అంటూ మహిళా సీపీఓను ప్రశ్నించారు.

దానికి ఆమె మాడమ్ మీరు సివిల్ డ్రెస్ లో ఉన్నందున గుర్తించలేదని వివరణ ఇచ్చారు. దానికి ఐశ్వర్య స్టేషన్ ఆవరణలోకి ఓ అధికారిక వాహనం వచ్చినా పట్టించుకోరా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నారని..సదరు మహిళా పోలీసుకు రెండు రోజుల పాటు ట్రాఫిక్ డ్యూటీ వేశారు.

ఈ విషయంపై..కేరళ పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర హోం శాఖకు అధికారికంగా ఫిర్యాదు ఇచ్చింది. జనవరి 1 న కొచ్చికి బదిలీ అయిన ఐశ్వరా డోంగ్రే ఐదు రోజుల తరువాత బాధ్యతలు స్వీకరించారని..ఆమెను గుర్తించడంలో విఫలమైనందుకు దానికి పోలీసులను నిందించడం తప్పు అని వారు ఆరోపించారు.

దీనిపై కొచ్చి నగర కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ..భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూసుకోవాలని డిసిపి ఐశ్వర్యకు సూచించామని తెలిపారు. ఆమె ఒక యువ అధికారిణి..ఆమెకుపెద్దగా అనుభవం లేకపోవడం వల్ల అలా అటువంటి చర్యలు తీసుకున్నారని అన్నారు.