కృష్ణా జిల్లాలో హవాలా నగదు కలకలం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

police seized Rs.80 Lakhs hawala money : కృష్ణాజిల్లా గరికపాడు వద్ద సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్నరూ.80 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన చిల్లకల్లు పోలీసులు ఓ కారులో భారీ మొత్తంలో నగదు గుర్తించారు.

ఈ సందర్భంగా నగదు తరలిస్తున్న సికింద్రాబాద్ కు చెందిన బంగారం వ్యాపారి మహ్మద్ బాషాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి కొల్ కతా కు హవాలా నగదు రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


కాగా … కొల్ కతాలో భూమి కొనుగోలు చేయటానికి ఈ నగదు తీసుకు వెళుతున్నట్లు నిందితుడు వివరించాడు. ఈ నగదుకు సరైన ఆధారాలు చూపించక పోవటంతో, పోలీసులు ఆదాయపన్నుశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఇచ్చిన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్నారు. హవాలా డబ్బుగా గుర్తించిన పోలీసులు ఈ రాకెట్ లో సూత్రధారులను గుర్తించే పనిలో బాషాను ప్రశ్నిస్తున్నారు.Related Tags :

Related Posts :