లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘రాధే శ్యామ్’ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు..

Published

on

Krishnam Raju: రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరి.. ‘రాధే శ్యామ్’.. గోపికృష్ణా మూవీస్ సమర్పణలో, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. కృష్ణం రాజు కుమార్తె, ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి నిర్మాతగా పరిచయమవుతున్నారు. ‘జిల్’ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇచ్చింది.

రెబల్ స్టార్ కృష్ణం రాజు ‘రాధే శ్యామ్’ లో పరమహంస అనే క్యారెక్టర్లో కనిపించనున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇంతకుముందు ‘బిల్లా’, ‘రెబల్’ సినిమాల్లో ప్రభాస్, కృష్ణంరాజు కలిసి నటించారు. ‘రాధే శ్యామ్’ వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న మూడో చిత్రం.

Radhe Shyam