లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

బీజేపీకి అవకాశం ఇస్తే గోల్కొండ, చార్మినార్‌తో పాటు జీహెచ్ఎంసీని కూడా అమ్మేస్తారు.. కేటీఆర్ ఫైర్

Published

on

ktr fires on bjp: తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై పైర్ అయ్యారు. మంగళవారం(నవంబర్ 24,2020) టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిస్తే గోల్కొండ, చార్మినార్ తో పాటు జీహెచ్ఎంసీని కూడా అమ్మేస్తారని కేటీఆర్ అన్నారు.

మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా.. ఇవి మోడీ పాత స్లోగన్స్.. ఇప్పుడు మోడీ కొత్త స్లోగన్ బేజో ఇండియా(ఇండియాని అమ్మేయ్) అని కేటీఆర్ విమర్శించారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసింది ఎవరు అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కొంతమంది గుజరాతీయుల కోసం ప్రైవేటీకరిస్తున్నారా? అని అడిగారు. బీజేపీపై ఎందుకు ఎన్ని చార్జిషీట్లు వెయ్యచ్చో కేటీఆర్ వివరించారు.కేటీఆర్ కామెంట్స్:
* ఐటీఐఆర్ ను రద్దు చేసింది ఎవరు?
* మీరు వస్తే జీహెచ్ఎంసీని కూడా అమ్మేస్తారు
* కొంతమంది గుజరాతీయుల కోసం ప్రైవేటీకరిస్తున్నారా?
* ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు?
* రాజ్యాంగం సాక్షిగా మాకు రావాల్సిన దానికంటే ఒక్క పైసా అన్నా ఎక్కువ ఇచ్చారా
* మీ మీద చార్జిషీట్లు వెయ్యాలంటే చాలా ఉన్నాయి
* నీతి ఆయోగ్ చెప్పినా మిషన్ భగీరథకు ఒక్కపైసా ఇవ్వనందుకు చార్జిషీట్ వెయ్యాలి

* తెలంగాణకు పన్ను రాయితీలు ఇవ్వనందుకు మీపై చార్జిషీట్ వెయ్యాలి
* క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, పెట్రోల్ ధరలు తగ్గించనందుకు చార్జిషీట్ వెయ్యాలి
* ఎస్బీహెచ్ ను ఎస్బీఐలో కలిపినందుకు ఉద్యోగుల మీపై చార్జిషీట్ వెయ్యాలి
* హైదరాబాద్ లో ఉగ్రవాదానికి తావు లేకుండా చేసినందుకా మాపై చార్జిషీట్
* ఎంఐఎంతో లేని పొత్తు అంటగడుతున్నారు
* 20లక్షల కోట్ల ప్యాకజీలో ఎన్ని సున్నాలున్నాయో మీకు తెలుసా?
* 20లక్షల కోట్ల ప్యాకేజీతో బాగుపడ్డవాళ్లు 20మందైనా ఉన్నారా?
* యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నందుకు మీపై దేవుడు కూడా చార్జిషీట్ వేస్తాడు
* ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచినందుకు మీపై చార్జిషీట్ వేయాలి* నష్టాల్లో ఉన్న ఎయిరిండియాని అమ్ముతున్నారు, లాభాల్లో ఉన్న ఎల్ఐసీని కూడా అమ్ముతున్నారు
* బీజేపీకి అవకాశం ఇస్తే గోల్కొండ, చార్మినార్ తో పాటు జీహెచ్ఎంసీని కూడా అమ్ముతారు
* మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్విట్ ఇండియా.. ఇవి మోడీ స్లోగన్స్…. ఇప్పుడు కొత్త స్లోగన్ బేజో ఇండియా(అమ్మేయ్ ఇండియాని)

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *