రేపటి నుంచే గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలోకి కేటీఆర్, కూకట్‌పల్లి నుంచి ప్రారంభం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ktr ghmc elections campaign: రేపటి(నవంబర్ 21,2020) నుంచే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతుంది టీఆర్ఎస్‌. రేపటి నుంచి కేటీఆర్ రోడ్‌షోలు ప్రారంభం కానున్నాయి. మొదట కూకట్‌పల్లిలో రోడ్‌షో నిర్వహించనున్నారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్. ఆదివారం(నవంబర్ 22,2020) నుంచి కేటీఆర్‌ రోడ్‌షోలు ఉంటాయని మొదట ప్రకటించినప్పటికీ ఒక రోజు ముందే ప్రచార బరిలోకి దిగుతున్నారు కేటీఆర్. రేపు సాయంత్రం 4గంటలకు కేటీఆర్ మొదటి రోడ్‌షో ఉంటుంది.
డిసెంబర్‌ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 4న ఫలితాలు వెల్లడిస్తారు. అవసరమైన చోట్ల డిసెంబర్‌ 3న రీ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఇప్పటికే డివిజన్ల వారీగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నవంబర్‌ 20 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. నవంబర్‌ 21 న నామినేషన్ల పరిశీలన. నవంబర్‌ 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. డిసెంబర్‌ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

పవన్ సంచలన నిర్ణయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన దూరం, బీజేపీ తరఫున ప్రచారం


గ్రేటర్‌ ఎన్నికలు:
* డిసెంబర్‌ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌
* మధ్యాహ్నం 12 గంటలకల్లా బ్యాలెట్‌ పేపర్లు సెపరేటు
* మధ్యాహ్నం 3 గంటలకల్లా ఫలితాలు
* ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 నామినేషన్‌ డిపాజిట్‌
* ఇతర అభ్యర్థులకు రూ.5000 నామినేషన్‌ డిపాజిట్‌
* రిటర్నింగ్‌ అధికారి దగ్గరకు వచ్చే నామినేషన్లు దాఖలు చేయాలి
* 48వేల మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణ
* తెలుగు రంగు బ్యాలెట్‌ పేపర్‌ వినియోగం
* మొత్తం 2,700 పోలింగ్‌ కేంద్రాలు
* 1439 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు
* సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,004
* అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 257

జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు
* గ్రేటర్‌ మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌
* బీసీ -50: (జనరల్‌ 25, మహిళలు 25)
* ఎస్సీ -10: (జనరల్‌ 5, మహిళలు 5)
* ఎస్టీ-2: (జనరల్‌ 1, మహిళ 1)
* జనరల్‌ -44
* జనరల్‌ మహిళ -44Related Tags :

Related Posts :