బరిలోకి ఒక వీర విధేయుడు, ఒక ప్రముఖ గాయకుడు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి కేటీఆర్ సరికొత్త వ్యూహం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల కోలాహలం మొదలైంది. ఖాళీ అయిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు గవర్నర్‌ కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ మొదలైంది. గవర్నర్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్‌ పదవులకు ఎక్స్‌టెన్షన్‌ దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. మరొక ఖాళీని తొలుత దేశపతి శ్రీనివాస్‌తో భర్తీ చేయాలని టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ భావించారట. కాకపోతే ఈ మధ్య కాలంలో కొన్ని డిమాండ్లు మొదలయ్యాయి. తటస్థులు, మేధావులతో గవర్నర్‌ నామినేటెడ్‌ స్థానాలను భర్తీ చేయాలని కొన్ని వర్గాలు కోరుతున్నాయి.

తెలంగాణను పీడిస్తున్న లంచం..! ఆటపాట తోనే తరిమికొట్టాలన్న గోరేటి వెంకన్న..!! | Have to iradicate bribes in Telangana by cultural activities only..says goreti Venkanna..! - Telugu Oneindia

బరిలోకి కొత్త ముఖం, వెంకన్నకు చాన్స్:
వివిధ వర్గాల డిమాండ్ల నేపథ్యంలో కేసీఆర్‌ కొత్త ముఖాన్ని రంగంలోకి తీసుకొచ్చారని చెబుతున్నారు. ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్నకు ఒక స్థానాన్ని కేటాయిస్తే బాగుంటుందనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారట. ఆయనకు పదవి ఇవ్వడం ద్వారా రెండు రకాలుగా లాభముంటుందని అంచనా వేస్తున్నారని చెబుతున్నారు. ఎస్సీ సామాజికవర్గానికి పదవి ఇచ్చినట్టు అవుతుందని, అదే సమయంలో ఏ పార్టీకి చెందని తటస్థుడికి అవకాశం కల్పించినట్టు ఉంటుందని భావిస్తున్నారట.

టీఆర్ఎస్ కు అచ్చిరాని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు:
మరోపక్క, తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అచ్చి రావడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన తొలి ఏడాది జరిగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌ను బరిలోకి దింపారు. ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. రాష్ట్రమంతా గులాబీ హవా వీస్తున్న సమయంలో ఈ ఓటమి అధికార పార్టీని తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ తర్వాత జరిగిన పలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలే వచ్చాయి.

ఓటమి సెంటిమెంట్‌కు బ్రేక్‌ వేసేందుకు వ్యూహం:
2018 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి.. ఆ తర్వాత జరిగిన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్‌పై గెలిచి గట్టి షాక్ ఇచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా గెలిచేందుకు సరికొత్త వ్యూహంతో అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు అచ్చిరావడం లేదనే సెంటిమెంట్‌కు బ్రేక్‌ వేయాలని చూస్తున్నారట.

బొంతు రామ్మోహన్ కు మ‌రోసారి క‌రోనా టెస్ట్‌..రిపోర్ట్స్‌... -Bonthu Rammohan : once again for corona tests.వీర విధేయుడికి కేటీఆర్ చాన్స్:
ఈ సారి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల మండలి స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కేటీఆర్ పక్కా వ్యూహాన్ని ఖరారు చేశారట. గ్రేటర్ ఎన్నికలకు ముందే ఈ ఎమ్మెల్సీ సీటును దక్కించుకోవడం ద్వారా కమలం పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని భావిస్తున్నారట కేటీఆర్. అందుకే ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో అభ్యర్థి ఎవరన్న విషయంపై మంత్రి కేటీఆర్‌ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఈ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ మద్దతుదారుడిగా ప్రస్తుత గ్రేటర్‌ మేయర్ బొంతు రామ్మోహన్‌ను బరిలోకి దింపాలని కేటీఆర్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బొంతు రామ్మోహన్‌ అయితే సరైన అభ్యర్థిగా భావిస్తున్న కేటీఆర్‌:
ఉస్మానియా యానివర్సిటీలో చదువుకున్న రామ్మోహన్.. అక్కడి విద్యార్థి సంఘాలలో చురుకుగా పనిచేశారు. బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలోనూ కీలకంగా పనిచేసి, ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పటికీ కొందరు బీజేపీ సానుభూతిపరులు రామ్మోహన్‌తో సన్నిహితంగా ఉంటారనేది టాక్‌. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పనిచేసిన రామ్మోహన్‌కు అన్ని పార్టీలతో మంచి లింకులే ఉన్నాయి. ఆయన అయితేనే ఈ ఎమ్మెల్సీ స్థానానికి కరెక్ట్‌ అని కేటీఆర్‌ ఒక నిర్ణయానికి వచ్చారట. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కూడా రామ్మోహన్ వైపే మొగ్గు చూపుతున్నారట.

ఎమ్మెల్సీగా గెలిస్తే రామ్మోహన్‌కు మంత్రి పదవి?
గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గెలిచినా మరోసారి రామ్మోహన్‌కు మేయర్‌ పీఠంపై కూర్చొనే అవకాశం కష్టం. ఈసారి మేయర్ పదవి బీసీ మహిళకు దక్కనుంది. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి రామ్మోహన్‌ను దింపాలని కేటీఆర్‌ నిర్ణయించారట. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆయనకు మంత్రి పదవి కూడా ఖాయమన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. కేటీఆర్‌ కూడా ఈ విషయంలో రామ్మోహన్‌కు ఇదివరకే హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

గట్టి పోటీ తప్పదనే అంచనాలు:
ఒక పక్క, గవర్నర్‌ కోటా కింద గోరటి వెంకన్నకు అవకాశం కల్పించడం ద్వారా ఎస్సీ సామాజికవర్గానికి మరింత దగ్గర కావచ్చని టీఆర్ఎస్‌ భావిస్తోంది. ఇక, ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ పట్టభద్రుల స్థానం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డికే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఈసారి ఇక్కడ నుంచి తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పోటీ చేయబోతున్నారని టాక్‌. ఆయన పోటీ చేస్తే… ఇక్కడ గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఎత్తుగడలు ఎంత వరకూ వర్కవుట్‌ అవుతాయో చూడాలి.
Related Posts