లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

గ్రేటర్‌లో ఆశించినన్ని సీట్లు రాలేదు.. స్వల్ప తేడాతోనే ఓడిపోయాం: కేటీఆర్

Published

on

గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 15-20రోజులుగా కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు, సోషల్ మీడియా వారియర్స్ కు ప్రతి ఒక్కరికి పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు’

‘టీఆర్ఎస్ నాయకులకు ఓటు వేసి గెలిపించిన వారికి ధన్యవాదాలు. ఫలితాలు ఆశించినంతగా రాలేదు. వచ్చినదాని కంటే 20-25 వస్తాయని ఆశించాం. ఎగ్జిట్ పోల్స్ లో కూడా అలానే వచ్చాయనే చెప్పాయి. బీఎన్ రెడ్డి 18, అడిక్ మెట్ లో 200, మూసాపేట్ లో 100ఓట్లు లాంటి స్వల్ప తేడాతోనే ఓడిపోయాం. 10-12 స్థానాల్లో ఇలాగే జరిగింది.



పార్టీ సమావేశం పెట్టుకుని కూలంకూషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రజలు ఏం ఆశిస్తున్నారో చర్చిస్తాం. సింగిల్ అతిపెద్ద పార్టీగా ఫామ్ అయి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని కేటీఆర్ ముగించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *