అడిగినంత డబ్బిస్తే ఎవరికైనా రూమ్స్‌ అద్దెకు ఇచ్చేస్తారా..? పేర్లు, ఐడీ ఫ్రూఫ్‌లు అవసరం లేదా? ఆ హోటల్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

kukatpally student gang rape: ఆ హోటల్స్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయా..? అడిగినంత డబ్బులిచ్చేస్తే ఎవరికైనా రూమ్స్‌ అద్దెకు ఇచ్చేస్తారా..? డబ్బు ఇచ్చేస్తే పేర్లు, ఐడీ ఫ్రూఫ్‌లు అవసరం లేదా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. తాజాగా ఓ హోటల్‌లో యువతిపై అత్యాచార ఘటనతో వెలుగులోకి వచ్చిన విషయాలు..అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.

తెరపైకి అదో హోటల్‌.. తెరవెనుక అసాంఘిక కార్యకలాపాలు.? నిబంధనలను పక్కన పెట్టేసిన నిర్వాహకులు.? అడిగినంత డబ్బులిచ్చేస్తే అద్దెకు గదులు.? కూకట్‌పల్లి హోటల్‌లో యువతిపై అత్యాచారం.. అత్యాచార ఘటనతో వెలుగులోకి హోటల్‌ నిర్వాకం..

నలుగురు ఉన్నా అడగలేదు, అమ్మాయి ఉన్నా అడ్డు చెప్పలేదు:
కూకట్‌పల్లిలో ఉన్న హోటల్ లో ఓ యువతి(19)పై సామూహిక అత్యాచారం జరిగింది. అక్టోబర్ 5న ఈ దారుణం జరిగింది. కాగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా…షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ హోటల్‌ గత కొద్ది కాలంగా అసాంఘిక కార్యాకలపాలకు అడ్డాగా మారిందనే విషయం వెలుగు చూసింది. గదుల్లో ముగ్గురికి మాత్రమే అనుమతి ఉండగా.. నలుగురికి రూమ్‌ ఇవ్వడం..ఆ నలుగురిలో ఓ అమ్మాయి ఉన్నా..అడ్డు చెప్పకుండా లోపలికి పంపించడం..ఇలా హోటల్‌ నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

బర్త్‌ డే పార్టీ పేరుతో యువతిని తీసుకెళ్లిన యువకులు:
బాధితురాలు జూబ్లీహిల్స్‌లో నివాసముంటోంది. సికింద్రాబాద్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమె ఇంటికి సమీపంలో ఉండే..ముగ్గురు కుర్రాళ్లు ఆమెతో స్నేహం చేశారు. అక్టోబర్ 5న కాలేజీ ఫీజు కట్టేందుకు వెళ్లిన యువతికి.. ఆ ముగ్గురు కుర్రాళ్లు ఫోన్ చేశారు. బర్త్ డే పార్టీ అని చెప్పి బయటకు తీసుకెళ్లారు. కాసేపు..ట్యాంక్‌బండ్ బుద్ధవిగ్రహం దగ్గర మాట్లాడుకున్నారు. కేక్ కట్ చేసి పార్టీ చేసుకుందామని..కూకట్‌పల్లిలోని ఓ లాడ్జ్‌కు తీసుకెళ్లారు.

ప్లాన్ ప్రకారం కేక్ లో మత్తు మందు చల్లి గ్యాంగ్ రేప్:
కేక్ తీసుకొస్తానంటూ వెళ్లిన ఓ కుర్రాడు.. ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం దానిపై మత్తుమందు చల్లాడు. నువ్వే గెస్ట్.. ముందు నీకే కేక్ అంటూ ఆమెకు తినిపించారు. యువతి.. స్పృహ తప్పి పడిపోగానే.. ముగ్గురూ( జోసెఫ్, బొందగడ్ల నవీన్ రెడ్డి, రాములు) అత్యాచారం చేశారు. రేప్ చేసిన విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపేస్తామని ముగ్గురు కుర్రాళ్లు ఆ యువతిని బెదిరించారు. లాడ్జ్ నుంచి.. ఆటోలో ఇంటికి పంపించేశారు. బాధిత యువతి..తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పింది. దీంతో.. పేరెంట్స్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు..ఈ కేసును కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు.

READ  ఏపీ, తెలంగాణలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌:
3 నెలల క్రితం..జోసెఫ్ తనకు పరిచయమయ్యాడని..బాధిత అమ్మాయి చెప్పింది. బర్త్‌డే ఉందని చెప్పి..తనను తీసుకెళ్లారని..కేక్ తిన్నాక..ఏం జరిగిందో తనకు తెలియదని తెలిపింది. జరిగిన ఘటన ఎవరికైనా చెబితే..చంపేస్తామని బెదిరించారన్నారని వాపోయింది. ఇంటికొచ్చాక..తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిపింది. నిందితులకు కఠినశిక్ష పడాలని డిమాండ్ చేసిన యువతి..ఇలాంటి ఘటన మరొకరికి జరగొద్దని వేడుకుంది.

పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి:
యువతిపై రేప్ ఘటనకు సంబంధించి..కేసు నమోదు చేసిన కూకట్‌పల్లి పోలీసులు..విచారణ వేగవంతం చేశారు. హోటల్ నిర్వాకంపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు స్పందించారు. అత్యాచారం జరిగిన హోటల్‌ను పరిశీలించి..సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎవరి పేరుతో రూమ్ బుక్ చేశారు, ఎలాంటి గుర్తింపు పత్రాలు ఇచ్చారన్న దానిపై ఆరా తీశారు. సీసీ కెమెరా ఫుటేజీని కూడా పరిశీలించారు. అలాగే ఇలాంటి ఘటనలు గతంలో ఏమైనా పునారవృతమయ్యాయా..? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి హోటల్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది.

Related Posts