నలుగురు దర్శకుల ‘కుట్టి లవ్‌స్టోరీ’..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kutti Love Story Promo: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులంతా వినోదం కోసం ఓటీటీలకే ఓటేస్తున్నారు. వెబ్ సిరీస్, సినిమాలతో పలు ఓటీటీ సంస్థలు ఆడియెన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి పోటీ పడుతున్నాయి.కొత్త కంటెంట్‌తో తెరకెక్కుతున్న పలు వెబ్ సిరీస్‌లకు
మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు డిఫరెంట్ లవ్‌స్టోరీలు.. నలుగురు పాపులర్ డైరెక్టర్లతో తమిళనాట ఓ వెరైటీ వెబ్ సిరీస్ రూపొందుతోంది.

‘కుట్టి లవ్‌స్టోరీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వేల్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మేనన్, వెంకట్ ప్రభు, ఎ.ఎల్.విజయ్, నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. 30 నిమిషాల నిడివితో ఉండే ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు రూపొందిస్తున్నారు.తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. నాలుగు విభిన్నమైన ప్రేమకథలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను ఏ పార్ట్ డైరెక్టర్ ఆ పార్ట్‌ కథలోని ప్రేమ సంగతులను తమ వాయిస్ ఓవర్ ద్వారా చెప్పడం విశేషం. ‘4 డైరెక్టర్స్ ఫర్ లవ్’ అంటూ కట్ చేసిన ప్రోమో ఆసక్తికరంగా అనిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘కుట్టి లవ్‌స్టోరీ’ సిరీస్ త్వరలో ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.Related Posts