లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

IPL-2020

గబ్బర్ వంద వేస్ట్.. పంజాబ్ హ్యాట్రిక్ గెలుపు.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం!

Published

on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 38 వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) మరియు ఢిల్లీ క్యాపిటల్స్(DC)పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది.


అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19ఓవర్లలో 167పరుగులు చేసి పంజాబ్ జట్టుపై 5 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గబ్బర్ సెంచరీ వృధా అవగా.. పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగానే ఉన్నాయి.. ఢిల్లీపై విజయంతో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో 10మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో 5వ ప్లేస్‌లోకి చేరుకుంది. పంజాబ్ జట్టుకు ఇది హ్యాట్రిక్ విక్టరీ.

ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ని చేధించి పంజాబ్.. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. పంజాబ్ ఓపెనర్లు విఫలమైనా.. క్రిస్ గేల్ 13 బంతుల్లో 29 పరుగులు చేయగా.. నికోలాస్ పూరన్ 28 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాక్స్‌వెల్ 24 బంతుల్లో 32 పరుగులు చేయగా.. దీపక్ హుడా(15), జేమ్స్ నీషమ్(10) పరుగులు చేసి పంజాబ్‌ను గెలిపించారు. ఢిల్లీ బౌలర్లలో రబడాకు రెండు వికెట్లు, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌కు తలా ఒక వికెట్ లభించింది.

ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది నాలుగో విజయం. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్లో కేవలం ఏడు పరుగులు చేసి 25 పరుగులు వద్ద ఓపెనర్ పృథ్వీ షా పెవిలియన్‌కు చేరగా.. తరువాత, మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 14 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే అయ్యర్, శిఖర్ ధావన్ రెండో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.

రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ, అద్భుతమైన ఫామ్‌లో శిఖర్ ధావన్ పంజాబ్ బౌలర్లపై దాడి చేస్తూనే ఉన్నాడు. ధావన్ 61 బంతుల్లో అజేయంగా 106 పరుగులు చేశాడు. ధావన్ తన ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. ఈ సీజన్‌లో ధావన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. ధావన్‌తో పాటు, రిషబ్ పంత్ 14, మార్కస్ స్టోయినిస్ 09, శిమ్రాన్ హెట్మియర్ 10 పరుగులు చేశారు. పంజాబ్ తరఫున మొహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను తన కోటాలోని నాలుగు ఓవర్లలో 28 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్, జేమ్స్ నీషామ్, మురుగన్ అశ్విన్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.