La Gobarina

పేడ పూసుకుంటారు.. పండుగ చేసుకుంటారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘జిందగీ నా మిలేగీ నా దోబారా’ సినిమాలో స్పెయిన్‌లో జరిగే ‘లా టమాటినా ఫెస్టివల్’ గురించి చూశాం. టామాటాలను విసురుకుంటూ వాటి గుజ్జుతోనే పండుగ జరుపుకుంటారు. సరిగ్గా అలాంటిదే దక్షిణ భారతదేశంలో జరిగే గోరె హబ్బా పండుగ. ఇక్కడ టమాటాలకు బదులు ఆవు పేడ. తమిళనాడులోని గూమటపూరా గ్రామంలో ఈ పండుగను కేరింతలు కొట్టుకుంటూ జరుపుకుంటున్నారు. పేడ అంటేనే ముఖం చిట్లించి చూసే వాళ్లు ఇది తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల ముగిసిన పండగ ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. 

దీపావళి పండుగ ముగిసిన కొద్ది రోజుల తర్వాత ఈ పండుగ వస్తోందట. గూమటపూరా గ్రామస్థుడైన ప్రభు మాట్లాడుతూ.. ‘ఆవు పేడ ఎన్నో వైద్యపరమైన బెనిఫిట్ లను సహజంగా అందిస్తుంది. కొందరు పేడను విసురుకుంటే క్రిములు ఏర్పడి జబ్బులు వస్తాయని అనుకుంటారు. కానీ, బీరేశ్వర అనే దేవుడ్ని నమ్ముకుని మేం చేసుకునే పండుగతో మాకు ఏమీ జరగదు. ఇందులో పాల్గొనడానికి ఎటువంటి కుల, మత పట్టింపులు ఉండవు. అందరూ చేసుకోవచ్చు. కానీ, మహిళలకు అనుమతి లేదు’ అని తెలిపాడు. 

గతంలో ఓ స్వామిజీ ఆవుపేడతో శివలింగాన్ని ప్రతిష్టించాడు. అప్పటి నుంచి ఆ లింగం పేడతోనే ఉంటుంది. దాంతో ఆ గ్రామంలో పేడకు విలువ పెరిగింది. అంతేకాకుండా గుడి వెనుక భాగంలో గోడకు ఆవుపేడతో పిడకలు కూడా వేస్తుంటారు. గ్రామాల్లో దీనిని పవిత్రంగా భావించి ఇంటి ముందు ఉంచుకుంటారు. ఇది చాలా వ్యాధులను నయం చేస్తుందని భావిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. 

Related Posts