అమీర్ ఖాన్ ‘Laal Singh Chadha’ పోస్ట్ పోన్డ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్ మిస్టర్ ఫర్ పెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న న్యూ ఫిల్మ్..‘లాల్ సింగ్ చద్దా’ రిలీజ్ డేట్ పో స్ట్ పోన్డ్ అయ్యింది. తొలుత డిసెంబర్ 25వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ..కరోన ఏర్పడిన కారణంగా..సినిమా షూటింగ్ జరగలేదు.దీని కారణంగా…ఈ ఏడాది కాకుండా..వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా..విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం టర్కీలో ఉంది. ఇక ఈ సినిమా ద్వారా..తమిళ నటుడు విజయ్ సేతుపతి బాలీవుడ్ కు పరిచయం కానున్నారు.

అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్, అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కామెడీతో రూపొందుతున్నట్లు సమాచారం. టామ్ హ్యాంక్స్ ముఖ్యపాత్రలో నటించిన హలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా చిత్రం తెరకెక్కుతోంది.లాల్ సింగ్ చద్దా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారా, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ కరోనా కారణంగా..సినిమా షూటింగ్ లు జరగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగ కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ప్రభుత్వ ఆంక్షలు, నిబంధన నడుమ షూటింగ్స్ చేస్తున్నారు.

విదేశాల్లో సైతం షూటింగ్ కు ప్లాన్ వేసుకుంటున్నారు. లాక్ డౌన్ కంటే ముందు.. ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ సగభాగం పూర్తి చేసుకుందని సమాచారం. టర్కీలో తిరిగి ఆరంభించాలని అనుకున్నా..కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్డ్ అయ్యింది.


Related Posts