తల్లి నుంచి గర్భంలో ఉన్నప్పుడే శిశువుకు COVID-19 సోకుతుందనడానికి గట్టి ఆధారం ఇదే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా ఉన్నట్లు.. అది తల్లి నుంచే కూతురికి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అమెరికాలోని టెక్సాస్ ఉండే యువతికి కొవిడ్-19 సోకింది. దీంతో ఆమెకు ఉమ్మ నీరు పడిపోయి 34వారాలకే ప్రసవించింది. ముందుగా ఆరోగ్యంగా కనిపించడంతో పాపను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించారు. తర్వాతి రోజే ఆ పసిపాపకు జ్వరం, శ్వాస సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

SARS-COV-2 ఇన్ఫెక్షన్ తో ప్రసవం తర్వాత 24నుంచి 48గంటల్లో COVID-19గా మారినట్లు వైద్యులు అంటున్నారు. చాలా రోజులుగా సప్లిమెంట్ ఆక్సిజన్ తో ఆమెకు చికిత్స అందిస్తున్నాం. వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం అయితే రాలేదు. కరోనావైరస్ గురించి టెస్టులు చేస్తూ ఉన్నా. కానీ, 21రోజులకే తల్లీబిడ్డను మంచి హెల్త్ కండిషన్ లోనే ఇంటికి పంపేశాం.

డల్లాస్ లోని టెక్సాస్ సౌత్ వెస్టరన్ మెడికల్ సెంటర్ మెడిక్స్.. గర్భంలో ఉండగానే తల్లి నుంచి శిశువుకు కరోనా సోకే అవకాశాలు ఉన్నాయి. డా. అమండా మాట్లాడుతూ.. ‘చాలా మంది పిల్లలు SARS-COV-2తోనే పుడుతున్నారు. మేం చేస్తున్న స్టడీ ప్రకారం.. ప్లాసెంటాలోని ఫెటల్ కణాలకు SARS-COV-2 గర్భిణీగా ఉన్నప్పుడే సోకుతుందా అని తెలుసుకోనున్నట్లు రీసెర్చర్స్ అంటున్నారు.

పాప డెలివరీ అయిన రెండో రోజు సమస్యలు బయటపడ్డాయి. పాప పుట్టిన 24గంటల తర్వాత చేసిన టెస్టుల్లో కొవిడ్ పాజిటివ్ అని వచ్చింది. 14రోజుల పాటు వైరస్ లక్షణాలు కనిపించాయి. రీసెర్చర్స్ ప్లాసెంటాను పరీక్షించి వైరస్ గురించి పూర్తి వివరాలు సేకరించనున్నారు. ఈ టెస్టుల్లో గర్భంలో ఉన్నప్పుడే కరోనా సోకిందా.. డెలివరీ అయిన తర్వాత వ్యాపించిందా తెలుసుకోనున్నారు.

Related Posts