కిలాడీ లేడీ క్రిమినల్స్…. ఫ్రెండ్ షిప్ పేరుతో చాటింగ్, మీటింగ్, డేటింగ్….చివరకు బ్లాక్ మెయిలింగ్…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వారు పెద్దగా చదువుకోలేదు….. టెక్నికల్ గా పెద్ద నాలెడ్జ్ ఉన్నవాళ్లు కాదు.. కానీ స్మార్ట్ ఫోన్ వాడకం… అందులో యాప్ ల ద్వారా ఆన్ లైన్ వ్యవహరాలు ఎలా చక్కబెట్టాలి అనే విషయాల్లో ఆరితేరిన వారు. స్మార్ట్ ఫోన్ ద్వారా అవతలి వారిని ఎలా బురిడీ కొట్టించి తప్పించుకోవాలో బాగా మెళుకువలు తెలిసిన వారు. తమనెవరూ గుర్తు పట్టకుండా… చేయాల్సిన నేరం చేసేసి తప్పించుకు పోతారు.గతంలో దొపిడీలు దొంగతనాలు మర్డర్లకు పేరుగాంచిన రాజస్ధాన్ భరత్ పూర్ గ్యాంగ్ లు ఇప్పడు సైబర్ క్రైమ్ లు చేయటానికి అలవాటు పడ్డాయి. వీరి వలలో చిక్కుకున్న వారు చాలా మంది పరువు పోతుందని , పోలీసు కంప్లయింట్ ఇవ్వకుండా , మానసిక వత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా భరత్ పూర్ గ్యాంగ్ పెట్టే టార్చర్ భరించలేక నెల రోజుల్లోనే 50 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఎలా మోసం చేస్తారు
కొందరు మహిళా సైబర్ క్రిమినల్స్ అందమైన ప్రోఫైల్ పిక్ తో సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగానే, మగవారు యాక్సెప్ట్ చేస్తారు. ఆతర్వాత వారు చాట్ చేయటం మొదలు పెడతారు. కొన్నాళ్లకు వీలుగా ఉంటుందని వాట్సప్ నెంబర్ తీసుకని దానిద్వారా చాట్ చేయటం మొదలు పెడతారు. కొన్నాళ్ళకు రెచ్చగొట్టేలా శృంగారపదజాలంతో చాటింగ్ మొదలెడతారు. తర్వాత వీడియోకాల్స్ చేస్తారు.ఇలా అలవాటుపడ్డాక ఉన్నట్టుండి ఒకరోజు న్యూడ్ వీడియో కాల్ చేసి రెచ్చగొడతారు. మొఖంకనపడకుండా జాగ్రత్తపడి నగ్నంగా అవతలివారిని ముగ్గులోకి దింపుతారు. ఇలా మగవారినిలైంగికంగా రెచ్చగొట్టి వారిని కూడా నగ్నంగా వీడియో కాల్ చేయమని కోరతారు. ఆడదాన్ని నేనే నగ్నంగా నీకు కనిపిస్తున్నప్పుడు మగవాడివి నీకు అభ్యంతరం ఏమిటి అంటూ ఆవేశపరుస్తారు. ఈలోపల మగవారికి తెలియకుండా వీడియో రికార్డింగ్ చేసేస్తారు.

తర్వాత రోజు ఆ నగ్న వీడియో పంపంచి బెదిరింపులకు దిగుతారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే … ఫేస్ బుక్ లోనూ, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలోనూ పోస్టు చేస్తామని టార్చర్ పెడతారు. దీంతో పరువు పోతుందని భయపడి చాలా మంది వీరు అడిగినంత డబ్బులు ఇచ్చి బయటపడుతుండగా …మరికొందరు భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు.హైదరాబాద్ లో
సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఓ వ్యాపారి ఇటీవల ఇలాంటి మహిళ వలలో పడ్డాడు. ఆమె అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో…..సదరు వ్యాపారి, ఆమెతో వీడియో కాలింగ్ లో ఉన్న నగ్న వీడియోలను సైబర్‌ క్రిమినల్స్‌ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. అవి చూసి పరువు పోయిందనే బాధలో ఆ వ్యాపారి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.

మీ స్మార్ట్ ఫోన్లో ఎంతమంచిగా ఫోటోలు తీసినా సరే, DSLRకి సాటి వస్తుందా?


కానీ.. కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చి సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించి సదరు వీడియోలను డిలీట్‌ చేయించుకున్నాడు. ఇలా చాలా మంది సైబర్ క్రిమినల్స్ కు చిక్కి లోలోపల కుమిలిపోతున్నారు. కొందరు మాత్రం ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చి.. వీడియోలను సోషల్‌ మీడియా నుంచి తొలగించుకుంటున్నారు. ట్రై కమిషనరేట్ల పరిధిలో నెల రోజుల్లోనే ఇలాంటి కేసులు 50 వరకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.మహిళల ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ల వస్తే జాగ్రత్త వహించండి
గుర్తు తెలియని మహిళలు సోషల్ మీడియాలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడితే బోల్తా పడొద్దని పోలీస్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. అశ్లీలానికి బానిసలుగా మారి.. ఆ వ్యామోహంలో క్రిమినల్స్‌ చెప్పిన ట్లు చేస్తే ఇబ్బందుల్లో పడుతారని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి బెదిరింపుల బారిన పడిన వారికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి.. వారిని డిప్రెషన్‌లో నుంచి బయటికి తీసుకువస్తున్నారు.

READ  మోడీజీ.. వాస్తవంలోకి రండి: మీ మాట వింటాం.. మా మాట కూడా వినండి

Related Posts