పెళ్లి కాకుండానే పండగకు అల్లుడిని ఇంటికి తెచ్చింది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Nayanthara and Vignesh Shivan celebrate Onam: లేడి సూపర్ స్టార్ నయనతార, తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌ మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఓనం పండుగను ఘనంగా జరుపుకుంది. చెన్నై నుంచి ప్రైవేట్ జెట్‌లో చేరుకున్న ఈ జంట కొచ్చి విమానాశ్రయంలో నడిచి వెళుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ లవ్ బర్డ్స్ కేరళలో ఓనం పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. నయన్, విఘ్నేష్ ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఆ ఫొటోలను నయన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.. ఓనం పండుగ శుభాకాంక్షలు.. మీ పెయిర్ బాగుంది.. పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు?.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

విరామ స‌మ‌యం దొరికితే చాలు విహార యాత్ర‌ల‌కు బయలుదేరే ఈ ప్రేమ ప‌క్షులు ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. డేటింగ్ బోర్ కొట్టినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటామని విఘ్నేష్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. నయన్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి గురించి స్పందించలేదు.

Nayanthara-Vignesh Shivan

Related Tags :

Related Posts :