అయోధ్య రామయ్య మందిరం భూమిపూజ ఆహ్వానపత్రిక ఇదే… శుభానికి ప్రతీకైన పసుపు వర్ణంలో

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మరో రెండు రోజులే. ఆగస్టు 5. అయోధ్యలో శ్రీరాముడి మందిర నిర్మాణానికి భూమి పూజ అంగరంగ వైభోగంగా జరగనుంది. ఈ భూమిపూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగిపోతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భూమిపూజ వేడుకకు స్థానికులతో పాటు ఎంతోమంది ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.శ్రీరాముడి మందిర భూమిపూజ కోసం అతిథులకు పంపిన ఆహ్వాన లేఖ ఒకటి బయటకు వచ్చింది. భూమిపూజ కోసం 200 మంది అతిథులు ఆహ్వానితులుగా రానుండగా కొన్ని కారణాల వల్ల దాన్ని కుదించి 170 మంది అతిథులు మాత్రమే రానున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా..రామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ అతిథులకు పసుపు వర్ణంలో కూడిన ఆహ్వానాన్ని పంపుతోంది. ఇందులో ప్రధాని మోడీ రాకపై కూడా సమాచారం ముద్రించారు. అతిథులంతా ఆగస్టు 4న సాయంత్రం నాటికే అయోధ్యకు చేరుకోవాలని ఆహ్వానపత్రికలో కోరారు.ఇప్పటికే కార్యక్రమానికి హాజరయ్యే కొంత మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌, బీజేపీ నాయకురాలు ఉమాభారతి, ఆలయ ఉద్యమంతో సంబంధం ఉన్న సాధ్వీ రితాంభర, బాబ్రీ మసీద్‌కు చెందిన ఇక్బాల్‌ అన్సారీ, రాజేంద్ర దేవచార్య తదితరుల పేర్లు వినస్తున్నాయి. కాగా, ఆగస్టు 5న మోడీ మొదట ఉదయం 11.15గంటలకు సాకేత్‌ కాలేజీకి వచ్చి, అక్కడి నుంచి హనుమాన్‌ గార్హి ఆలయానికి వెళ్తారు. అనంతరం భూమిపూజ కోసం రామ జన్మభూమికి వెళ్తారు. అనంతరం మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.

Related Posts