last-chance-to-decide-on-loan-moratorium-plan-supreme-court-to-centre

లోన్ మారిటోరియం ఇస్తారా? ఇవ్వరా? కేంద్రానికి లాస్ట్ చాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Rbi loan moratorium extension: లోన్ మారిటోరియపై తుది నిర్ణయం తెలిపేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి గడువు ఇచ్చింది. కాగా, ఇదే లాస్ట్ చాన్స్ అని తేల్చి చెప్పింది. లోన్ మారిటోరియంపై మీ నిర్ణయం ఏంటో తెలపాలని కేంద్రాన్ని అడిగింది. ఇందుకోసం రెండు వారాల గడువు ఇచ్చింది. ఇకపై వాయిదాల పర్వం ఉండదని, కచ్చితమైన నిర్ణయంతో తమ ముందుకు రావాలని కేంద్రాన్ని, ఆర్బీఐని ఆదేశించింది.

మారిటోరియం పీరియడ్ లో లోన్లపై వడ్డీలు మాఫీ చేసేలా చూడాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరుపుతోంది. గురువారం(సెప్టెంబర్ 10,2020) కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై కేంద్రం, ఆర్బీఐ తమ అంతిమ నిర్ణయాన్ని తెలపాలంది.

కరోనా నేపథ్యంలో రుణాలు, ఈఎంఐల చెల్లింపుపై రెండు విడతలుగా మూడు నెలల చొప్పున కేంద్రం మారటోరియం విధించింది. ఈ గడువు ఆగస్టు 31తో ముగిసింది. కాగా మారటోరియం సమయంలో వాయిదాలపై అదనపు వడ్డీ విధించాలనే ఆలోచనను సమీక్షించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి సుప్రీంకోర్టు ఇప్పటికే సూచించింది. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై త్రిసభ్య ధర్మాసనం విచారించింది.

చండీగఢ్ వ్యక్తికి మెర్సిడెస్ కారు అమ్మి బురిడీ కొట్టించిన వైజాగ్ వాసి


కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఆర్ధిక వ్యవస్థ స్తంభించి పోయింది. దీనికి తోడు వ్యాపారాల్లో నష్టం, ఉద్యోగాల కోత కూడా విధించారు. ఈ క్రమంలో లోన్ల ఈఎంఐలపై ఈ ఏడాది మార్చి నుంచి ఆగష్టు వరకు మారటోరియం కొనసాగించారు. సెప్టెంబర్ 1 నుంచి మారటోరియం గడువు ముగియడంతో తిరిగి లోన్ల ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది.

Related Posts